Airport Jobs : ‘ఎయిర్‌పోర్ట్స్’లో 119 జాబ్స్.. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు
Airport Jobs : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
- Author : Pasha
Date : 25-12-2023 - 12:47 IST
Published By : Hashtagu Telugu Desk
Airport Jobs : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) పోస్టులు 73, సీనియర్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్) పోస్టులు 25, సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్) పోస్టులు 19, జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్) పోస్టులు 02 ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసినవారు జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్), సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) పోస్టులకు అర్హులు. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) పోస్టులకు 10వ తరగతి, ఇంటర్, మెకానికల్/ ఆటోమొబైల్/ ఫైర్ డిప్లొమా హోల్డర్లు, హెచ్ఎంవీ, ఎల్ఎంవీ లైసెన్సు కలిగిన వారు అర్హులు. సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) పోస్టులకు ఎలక్ట్రానిక్స్, టెలికమ్యునికేషన్ /రేడియో ఇంజినీరింగ్ డిప్లొమా కలిగిన వారు(Airport Jobs) అర్హులు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. అయితే కొన్ని వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్- సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. మిగతా కేటగరీల అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజుగా కట్టాలి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 26. పూర్తి వివరాల కోసం ఏఏఐ అధికారిక వెబ్‌సైట్ www.aai.aeroను అభ్యర్థులు చూడొచ్చు. ఈ వెబ్‌సైట్ హోంపేజీలో కనిపించే కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేసి.. AAI సౌత్ రీజియన్‌లో కనిపించే Direct Recruitment for Jr.Asst (Fire Service) under SRD, Jr. Asst (Office), Sr.Asst(Electronics), Sr.Asst(Accounts) లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.