Depression in women: డిప్రెషన్ ప్రభావం మహిళల్లోనే ఎక్కువ
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సహజం.
- Author : Balu J
Date : 26-07-2022 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సహజం. డిప్రెషన్ తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చాలామంది ఒత్తిడి కదా.. లైట్ తీసుకుంటున్నారు. కానీ వాటివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువే. ఒత్తిడి ప్రభావం పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువట. సర్వేలు సైతం ఇదే విషయాన్ని చెప్తున్నాయి. బయోలాజికల్ సైకియాట్రీ జర్నల్‌లో నిర్వహించిన స్టడీలో ఈ విషయం బహిర్గతమైంది. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడి పనిచేసే మహిళలకు ఒత్తిడి ఎక్కువేనని డాక్టర్లు సైతం తేల్చి చెప్పారు.
ఒత్తిడి ప్రభావం అటు పురుషులు, ఇటు మహిళలపై పడుతున్నప్పటికీ, నిరాశ నిస్పృహ లక్షణాలతో మహిళలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మానవుల మెదడుల్లో ఒత్తిడి మార్పులను కనుగొన్న తర్వాత పరిశోధకులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పరిశోధకులు ఎలుకలపై ప్రయోగం చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. మగ, ఆడ ఎలుకలపై పరిశోధనలు చేయగా, ఆడ ఎలుకలపై ఒత్తిడి ప్రభావ ఎక్కువగా ఉన్నట్టు తేలిందని రీసెర్చర్స్ చెబుతున్నారు.