Brinjal: వీళ్ళు వంకాయ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదట.. తినకపోవడమే మంచిది!
వంకాయ ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు తినకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- Author : Anshu
Date : 30-12-2024 - 12:34 IST
Published By : Hashtagu Telugu Desk
మన వంటింట్లో దొరికే కూరగాయలలో వంకాయ కూడా ఒకటి. వంకాయను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. వంకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచుగా డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. కొందరు వంకాయతో చేసే కూరలను ఇష్టంగా తింటూ ఉంటారు. కొందరు వంకాయలు తినడానికి అంతగా ఇష్టపడరు. వంకాయలో ఫోలేట్, మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కెరాటిన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇది తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది.
వంకాయ శరీరంలోని అదనపు ఐరన్ తొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారి వంకాయ ఎంతో మేలు చేస్తుంది. అలాగే టైప్ 2 మధుమేహం రోగుల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో వంకాయ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వంకాయలో పిండి పదార్థాలు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇకపోతే వంకాయ మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. మరి ఎవరెవరు తినకూడదు అన్న విషయానికి వస్తే.. ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్న వారు వంకాయకు దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు. డిప్రెషన్ కి మందులు ఉపయోగించేవారు వంకాయ తినకపోవడం మంచిదట.
తింటే ఆ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే చర్మ సంబంధిత సమస్యలు, స్కిన్ ఎలర్జీ వంటి సమస్యలతో బాధపడేవారు వంకాయను తినకపోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారు వంకాయను తినకూడదట. మరి ముఖ్యంగా మెడిసిన్స్ తీసుకుంటున్న వారు వంకాయ కు దూరంగా ఉండటం మంచిదని లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు వంకాయకు దూరంగా ఉండాలట. ఎందుకంటే వంకాయకు ఆక్సలేట్ స్థాయిలు ఉంటాయి. ఈ ఆక్సలేట్ కిడ్నీలో రాళ్ళను ఏర్పరచడంలో దోహదపడుతుందట. అందుకే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు వంకాయ తినకూడదంటున్నారు. గ్యాస్ అజీర్తి కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడే వారు కూడా వంకాయను తినకపోవడమే మంచిది. ఇది తినడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదముందట.
కంటి శుక్లం, కంటి దురద, కంటిలో మంట, వాపు వంటి సమస్యలతో బాధపడేవారు వంకాయ తినకూడదట.