Drinking Water: ఉదయాన్నే నీళ్లు ఎందుకు తాగాలి? శరీరానికి కలిగే లాభాలు ఏంటీ?
సాధారణంగా ఒక మనిషి ఆహారం లేకుండా ఎక్కువ రోజులు బతకగలడేమో కానీ నీరు లేకుండా మాత్రం ఎక్కువ రోజులు బతకలేరు. నీరు శరీరానికి చాలా అవసరం.
- Author : Anshu
Date : 31-08-2022 - 8:15 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా ఒక మనిషి ఆహారం లేకుండా ఎక్కువ రోజులు బతకగలడేమో కానీ నీరు లేకుండా మాత్రం ఎక్కువ రోజులు బతకలేరు. నీరు శరీరానికి చాలా అవసరం. అంతేకాకుండా మీరు నీ శరీరానికి తగ్గట్టుగా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాగా పిల్లల శరీరంలో 75% నీరు ఉంటే పెద్దల శరీరంలో 55 శాతం నీరు ఉంటుంది. ఇది చాలామంది ప్రతి రోజు ఉదయం లేవగానే పరగడుపున నీటిని తాగుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉదయాన్నే మీరు తాగడం వల్ల.. బరువు కోల్పోయేందుకు మీరు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఉదయం నీరు తాగడం వల్ల మైగ్రేన్, అలాగే తలనొప్పికి మంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ క్రియ కూడా మెరుగుగా ఉంటుంది. అలాగే ఉదయం సమయంలో కాఫీకి బదులుగా వెచ్చని నీరు తీసుకోవడం ఇంకా మంచిది. ఉదయం పూట పరగడుపున నీళ్లు తాగడం వల్ల నోటి నుండి వచ్చే దుర్వాసనను గణనీయంగా తగ్గించవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదయాన్నే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు ఆహారంలో ఉండే ఫైబర్స్ జీర్ణం కావడం కోసం నీరు బాగా ఉపయోగపడుతుంది.
ఫైబర్స్ మలవిసర్జన సులువుగా కావడానికి సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయానే నీరు తీసుకోవడం వల్ల మలబద్ధకం కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ఉదయాన్నే లేవగానే పది దోసిల్లు నీరు తాగడం మంచిది అని నిపుణులు చెబుతూ ఉంటారు. ఉదయాన్నే నీటిని తాగడం వల్ల ఎంతో యవ్వనంగా ఉంటారు. అలాగే పెద్దలకు పిల్లలకు కూడా ఉదయాన్నే నీరు తాగడం అలవాటు చేస్తే వారు జీవితాంతం అజీర్తి, మూత్రపిండాల వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అదేవిధంగా రాగి చెంబుతో నీరు తాగడం వల్ల మలబద్ధక సమస్య ఉండదు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.