HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Happens When We Burn Camphor

Camphor: గుడిలో కర్పూరాన్ని వెలిగించకూడదు.. ఎందుకో తెలుసా?

గుడిలో కర్పూరాన్ని వెలిగించవచ్చా వెలిగించకూడదా, వెలిగిస్తే ఏం జరుగుతుంది. ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 29-04-2025 - 8:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Camphor
Camphor

కర్పూరం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కర్పూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కర్పూరం చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వం నుంచి కర్పూరం ని ఆయుర్వేదంలో వినియోగిస్తూనే ఉన్నారు. అదేవిధంగా కర్పూరంని దేవుడికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు అన్న విషయం తెలిసిందే. పూజ మొత్తం పూర్తి అయిన తర్వాత దేవుడికి హారతి ఇవ్వడం కోసం కర్పూరం ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కర్పూరం వెలిగించడం మంచిదే కానీ, అన్ని కర్పూరాలు ఒకటి కావట. అదేంటి అనుకుంటున్నారా మీకు తెలిసిన కర్పూరాలన్నీ మంచివి కావు.

ముఖ్యంగా ఆలయాల్లో వెలిగించే కర్పూరం నుంచి నల్లని పొగతో పాటు, ధూళి వెలువడుతుంది. కర్పూరం నుంచి వచ్చే పొగను బాగా గమనిస్తే దీనిలో నల్లటి రేణువులు కనిపిస్తాయి. కర్పూరం కాంఫర్ లారెల్ అనే చెట్టు నుంచి ఉత్పత్తి అవుతుంది. ఈ చెట్టు ఆకులు, కొమ్మలు, బెరడు నుంచి కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూరం చెట్టు సుమారుగా 100 అడుగుల వరకు పెరుగుతుందట. ఈ చెట్లు ఎక్కువగా చైనా, జపాన్ వంటి దేశాల్లో పెరుగుతాయట. ఇక మన దేశంలో అయితే ఈ చెట్లు మైసూరు ప్రాంతం, మలబార్, నీలగిరి కొండల్లో కనిపిస్తాయి. కర్పూరం సుమారుగా 20 రకాలుగా ఉంటుంది.

వీటిల్లో పచ్చ కర్పూరం చాలా ఫేమస్. వంటల్లో, ఆయుర్వేద మందుల తయారీలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పచ్చ కర్పూరాన్ని చెట్టు వేర్లు కాండం ఉపయోగించి సేంద్రీయ విధానాల్లో తయారు చేస్తారు. అయితే గుడిలో ఇచ్చే హారతే మనకు ప్రమాదకరమట. కానీ మిగిలిన అన్ని కర్పూరాలు మంచివే అని, ఎందుకంటే వీటిని సేంద్రీయ విధానాల్లో తయారు చేస్తారు. ఒక్క గుడిలో వెలిగించే హారతి కర్పూరం తప్ప. ఎందుకంటే దీన్ని టర్పంటైన్ ఆయిల్ ఉపయోగించి రసాయన పద్ధతిలో తయారు చేస్తారట. అందుకే వీటిని వెలిగించినప్పుడు నల్లటి పొగతో పాటుగా ప్రమాదకరమైన రేణువులు వెలుపడతాయి. వీటిలో కాలిన కర్బన పదార్థాలు ఉంటాయి. దీని పొగను పీల్చడం వల్ల అది నేరుగా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతుందట. దీంతో ఉబ్బసం, ఆయాసంతో పాటుగా కొన్ని రకాలు క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రసాయన పద్దతిలో తయారుచేసే కర్పూరాన్ని హారతిగా ఇవ్వడం వల్ల భక్తులు, అర్చకులు అనారోగ్య సమస్యల బారినపడాల్సి వస్తుందని హిందూ, అర్చక, ధర్మదాయ శాఖలు ఆరోపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ మీరు గుడిలో హారతి ఇవ్వాలి అనుకుంటే కర్పూర హారతికి బదులుగా దీప హారతి ఇవ్వచ్చు అని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • camphor
  • camphor benefits
  • Camphor burn
  • temple

Related News

Navagraapooja

Navagraha : గుడికి వెళ్లినప్పుడు నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలో తెలుసా ?

నవగ్రహ ప్రదక్షిణలు పూర్తయిన వెంటనే నేరుగా ఇంటికి వెళ్ళిపోకూడదు. ప్రదక్షిణలు ముగిసిన తర్వాత మరోసారి ప్రధాన దైవాన్ని (మూలవిరాట్టును) దూరం నుండి అయినా దర్శించుకుని, కాసేపు అక్కడ కూర్చుని ధ్యానం చేయాలి.

    Latest News

    • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

    • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

    • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

    • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

    • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

    Trending News

      • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd