Pregnant Tips: సిజేరియన్ కు ముందు గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా?
సిజేరియన్ డెలివరీలు, నార్మల్ డెలివరీలకు ముందు గర్భిణీ స్త్రీలు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:00 PM, Fri - 2 August 24

ఇదివరకటి రోజుల్లో గర్భిణీ స్త్రీలు హెల్దిగా ఉండడంతో పాటు మంచి మంచి ఆహారాన్ని తీసుకునేవారు. కానీ రోజులు మారిపోవడంతో గర్భిణీ స్త్రీలు ఏది పడితే అది తినడం వల్ల లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇదివరకటి రోజుల్లో గర్భిణీ స్త్రీలలు నార్మల్ డెలివరీలు ఎక్కువగా అయ్యేవారు. సిజేరియన్ డెలివరీలు చాలా తక్కువ మంది మాత్రమే అయ్యేవారు. కానీ ఇటీవల కాలంలో సిజేరియన్ డెలివరీలు ఎక్కువగా అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతి పదిమందిలో ఆరుగురు సిజేరియన్ డెలివరీలు అవుతుండగా మిగిలిన నలుగురు నార్మల్ డెలివరీ అవుతున్నారు. అయితే సిజేరియన్ డెలివరీల వల్ల ఆడవారికి ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి.
గర్భధారణ సమయంలో డెలివరీ గురించి ఆడవాళ్ల మనస్సులో ఎన్నో భయాలు, ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా మీకు సిజేరియన్ డెలివరీ అని డాక్టర్ చెబితే మరింత భయపడిపోతుంటారు. నార్మల్ డెలివరీతో పోలిస్తే సిజేరియన్ డెలివరీ చాలా కష్టం. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు తలెత్తడం మాత్రం చాలా వరకు తగ్గుతాయని చెబుతున్నారు. మరి సిజేరియన్ డెలివరీ కాకుండా నార్మల్ డెలివరీ డెలివరీ కావాలంటే డెలివరీ కి ముందు స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే నెలల నిండే సమయములో స్త్రీ మానసికంగా సిద్ధం కావాలి. అందుకోసం మీరు మంచి గైనకాలజిస్ట్ ని సంప్రదించడం మంచిది. మీ శారీరక పరీక్ష ఆధారంగా ప్రసూతి డాక్టర్ సంబంధిత సమస్యల గురించి సరైన సమాచారాన్ని ఇస్తాడు.
సరైన సమాచారం మీకు అన్ని రకాల సందేహాలు, ప్రశ్నలు, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే కంటి నిండా నిద్రపోవాలి. మంచి నిద్ర ఒత్తిడి యాంగ్జైటి నుంచి పొందేలా చేస్తుందట. అలాగే డెలివరీల గురించి భయపడేవారు తరచుగా ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం యోగా వంటివి చేయడం మంచిది. వైద్యుల సలహా మేరకు చిన్నచిన్న ఎక్సర్సైజులు చేయడం వల్ల కూడా నార్మల్ డెలివరిలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయట. ముఖ్యంగా డెలివరీ కి ముందు స్త్రీలు మిమ్మల్ని మీరు శారీరకంగా సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే శస్త్రచికిత్సకు 8 గంటల ముందు ఎలాంటి ఆహారాలను తినొద్దని డాక్టర్లు చెప్తుంటారు. కాబట్టి శస్త్రచికిత్సకు ఒక రోజు ముందు మీరు మీ ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఈ సమయంలో మీరు తేలికైన, జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. శస్త్రచికిత్సకు ముందు ఆహారంతో నీళ్లు, వేరే డ్రింక్స్ ను తాగడం తగ్గించాలి. శస్త్రచికిత్సకు 4 నుంచి 5 గంటల ముందు నీళ్లు తాగడం మానేయడం మంచిది. మీకు మలబద్ధకం సమస్య ఉంటే దాని గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి. నిజానికి శస్త్రచికిత్స సమయంలో జీర్ణక్రియ సరిగ్గా ఉండాలి. మీకు మలబద్దకం ఉంటే మీ కడుపును శుభ్రం చేయడానికి డాక్టర్ మందులను సూచించవచ్చు. డాక్టర్ ఇచ్చిన అన్ని సూచనలను సరిగ్గా పాటించాలి. ఇంట్లో పెద్దల సలహా అలాగే వైద్యుల సలహా తీసుకుంటే మీకు వీలైనంత వరకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.