Winter: వామ్మో.. చలికాలంలో ఎక్కువ వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తే ఇంత డేంజరా?
Winter: చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం శరీరానికి మేలు చేస్తుందని, అతి వేడిగా ఉండే నీరు గుండె, చర్మ సమస్యలు పెంచుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 08:00 AM, Wed - 19 November 25
Winter: చలికాలం వచ్చింది అంటే చాలు.. చలికి తట్టుకోలేక చాలా మంది వేడి నీతో స్నానం చేయడం, ముఖం శుభ్రం చేసుకోవడం, వేడి నీటితో కాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. చలికాలం వచ్చిందంటే చాలు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి గజగజ వణుకుతూ ఉంటారు. మరోవైపు నీళ్లు చల్లగా ఉంటాయి. ఉదయం సాయంత్రం వేళలో నీటిని ముట్టుకోవాలంటే చేతులు వణికి పోతుంటాయి. అందుకే చలికాలంలో చాలామంది సహజంగా వేడి నీటితోనే స్నానం చేస్తుంటారు. మరి కొంతమంది చలిని సైతం లెక్కచేయకుండా చల్లటి నీటితో స్నానం చేస్తారు. అయితే కొందరు అయితే చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తూ ఉంటారు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా కండరాలు, కీళ్లకు ఉపశమనం కలుగుతుంది.
మనసు ప్రశాంతంగా రిలాక్స్ గా ఉండాలంటే వేడి నీటితో స్నానం చేయడం ఉత్తమం అని చెబుతున్నారు. వేడినీటితో స్నానం చేయడం వల్ల చర్మం రంధ్రాలు తెరుచుకుంటాయి. పేరుకుపోయిన మురికి, శరీరం శుభ్రపడి బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తుందట. చలికాలంలో స్నానం చేయడానికి గోరువెచ్చని నీరు ఉత్తమమైనదని చెబుతున్నారు. గోరువెచ్చని నీరు చల్లదనాన్ని తగ్గిస్తుందట. అదే సమయంలో చర్మానికి హాని కలిగించకుండా సహజ నూనెలను కాపాడుతుందట. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా శరీరానికి మేలు జరుగుతుందట. ఎక్కువ వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయడం ద్వారా కొన్ని రకాల దుష్ప్రభావాలు ఏర్పడతాయట. వేడి నీళ్లు తల చర్మాన్ని పొడిబారేలా చేస్తాయట.
ఇది చుండ్రు, జుట్టు రాలడం, దురద వంటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. అతి వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా కొన్నిసార్లు తలనొప్పి పెరగవచ్చట. కొందరికి తాత్కాలికంగా బీపీ తగ్గిపోయినట్లు అనిపించవచ్చని చెబుతున్నారు. అతి వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. గుండె జబ్బులు ఉన్న వారికి వేడి నీరు రక్తనాళాలను విస్తరింపజేస్తుందని చెబుతున్నారు. ఇది గుండెపై అదనపు భారం పడేలా చేస్తుందని చెబుతున్నారు. వేడి నీళ్ల వల్ల శరీరం అధికంగా శ్రమ పడాల్సి వస్తుందట. దీనికి గుండె అధికంగా స్పందించవలసి ఉంటుందట. గుండెపోటు, స్ట్రోక్ పెరిగే ప్రమాదం ఉంటుందట. గుండె సమస్యలు ఉన్నవారు అతి వేడి నీళ్లు కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలట. ఫిట్స్ ఉన్నవారు బాగా చల్లని నీరు, అతిగా వేడి నీటితో స్నానం చేయడం అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చర్మ సమస్యలు ఉన్నవారు అతిగా వేడి నీరు చేయడం ద్వారా అవి మరింత పెరిగే అవకాశం ఉంటుందట. ఈ వ్యాధితో బాధపడేవారు ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మం మరింత ఎర్రగా కందిపోతుందట. అతిగా వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా ఏ వ్యక్తికైనా ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు బాగా చల్లటి నీరు, అతిగా వేడి నీటితో కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం అని చెబుతున్నారు.