HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Toothache Home Remedies

Toothache : పంటి నొప్పిని భరించలేకపోతున్నారా.. ఇలా చేస్తే చాలు వెంటనే ఉపశమనం పొందవచ్చు?

ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది పంటి నొప్పి సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చాలామందికి వేడి పదార్థా

  • Author : Anshu Date : 23-01-2024 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 23 Jan 2024 05 33 Pm 6301
Mixcollage 23 Jan 2024 05 33 Pm 6301

ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది పంటి నొప్పి సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చాలామందికి వేడి పదార్థాలు, చల్లని పదార్థాలు తీసుకుంటే చాలు వెంటనే పంటి నొప్పి మొదలవుతూ ఉంటుంది. ఈ పంటి నొప్పి వల్ల ఎటువంటి వస్తువులు కూడా తినలేక పోతుంటారు. ఈ పంటి నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. కొన్నిసార్లు పంటి నొప్పితో పాటు చిగుళ్ల పై వాపు కూడా వస్తుంటుంది. అప్పుడప్పుడు పంటి నొప్పి వస్తే పర్లేదు కానీ తరచుగా పంటి నొప్పి వేధిస్తుంటే మాత్రం వెంటనే డెంటిస్ట్ ను సంప్రదించడం మంచిది. అలాగే కొన్ని రకాల వంటింటి చిట్కాలు ఉపయోగించినా చాలు. ఈ పంటి నొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏవి అన్న విషయానికి వస్తే..

సాధారణంగా కొందరికి పళ్ల మధ్య గ్యాప్ రావడం వల్ల పంటి నొప్పి వస్తుంటుంది. అలాగే పళ్ల గ్యాప్ మధ్య ఆహారం ఇరుక్కుపోవడం వల్ల కూడా పంటి సమస్యలు వస్తుంటాయి. అటువంటప్పుడు పళ్ల మధ్యలో ఇరుక్కొని ఉన్న ఆహారాన్ని బయటికి లాగేయాలంటే ఉప్పు నీటితో మౌత్ వాష్ చేయాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిని పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా చేస్తే ఇన్ ప్లమేషన్ కూడా తగ్గిపోతుంది. దాని వల్ల నోట్లో ఉన్న చిన్న చిన్న పుండ్లు కూడా తగ్గిపోతాయి. అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ రిన్స్ ను ఉపయోగించి కూడా పంటి నొప్పిని తగ్గించవచ్చు. పళ్ల మీద ఉన్న బ్యాక్టీరియాను చంపేసి ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అయితే దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. 3 శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్ ను మాత్రమే తీసుకొని దాన్ని నీటిలో వేసి మౌత్ వాష్ లా ఉపయోగించాలి.

అయితే దీన్ని అస్సలు మింగకూడదు. పంటి నొప్పికి మరో బెస్ట్ మందు కోల్డ్ కంప్రెస్. కోల్డ్ కంప్రెస్ ను తీసుకొని పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దాలి. అలా చేస్తే అక్కడ రక్త నాళాలు దగ్గరికి చేరుకొని పంటినొప్పి తగ్గుతుంది. చిగుళ్లలో వాపు ఉన్నా ఇన్ ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తుంది. కోల్డ్ కంప్రెస్ చేయడం అంటే ఐస్ ముక్కలు వేసిన బ్యాగ్ ను పంటి వద్ద ఉంచడమే. అలాగే పెప్పర్ మింట్ టీ బ్యాగ్స్ కూడా పంటి నొప్పిని తగ్గిస్తాయి. మీ ఇంట్లో వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి రెబ్బను తీసుకొని దాన్ని పేస్ట్ చేసి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దాలి. ఇలా చేస్తే వెంటనే పంటినొప్పి తగ్గుతుంది. వెల్లుల్లి పేస్ట్ కు కాసింత ఉప్పు యాడ్ చేసినా కూడా పంటి నొప్పి తగ్గుతుంది. అలా కుదరకపోతే వెల్లుల్లి రెబ్బను తీసుకొని దాన్ని మెత్తగా నమలాలి. అలా చేసినా కూడా పంటినొప్పి వెంటనే తగ్గుతుంది. వంటింట్లో లవంగాల నూనె ఉన్నా, ఆ నూనెతో కూడా పంటి నొప్పిని తగ్గించవచ్చు. ఆ నూనెను పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో రుద్దాలి. లేదంటే ఒక గ్లాస్ లో కొన్ని నీళ్లను తీసుకొని దాంట్లో కాసింత లవంగా నూనె వేసి మౌత్ వాష్ కూడా చేయవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • home-remedies
  • teeth pain
  • Toothache
  • Toothache problems

Related News

Do you have severe knee pain?

Knee Pain: మీకు మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయా?

కొందరికి నాలుగు అడుగులు నడిస్తే చాలు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అంటుంటారు. మొదటి అంతస్తు మెట్లు కూడా ఎక్కలేక మోకాళ్లు పట్టుకున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు, యూరిక్ యాసిడ్ శరీరంలో దాని ప్రభావాన్ని పెంచడం వలన, అలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉంటే, ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల సమస్యకు కర్పూరం నూనె

  • Don't worry about a low sperm count... Follow these tips, and you'll be a true 'King of Men'!

    Sperm Count: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడొద్దు… ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

Latest News

  • Jr NTR లూగర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..!

  • Sunil Narang: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా

  • HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

  • Rahul Gandhi: మోడీ దేశద్రోహి : రాహుల్‌గాంధీ

  • Supreme Court: జనగణనలో కులగణనపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd