Toilet Seat: టాయిలెట్ లో ఎక్కువసేపు గడుపుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరికి టాయిలెట్ కి వెళ్ళినప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తూనే ఉ
- By Nakshatra Published Date - 09:20 PM, Mon - 11 September 23
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరికి టాయిలెట్ కి వెళ్ళినప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తూనే ఉన్నారు. కొందరు టాయిలెట్ కి వెళ్లిన బాత్రూం కి వెళ్ళినా తప్పకుండా మొబైల్ ని తీసుకుని వెళుతూ ఉంటారు. ఇక వెళ్ళిన పనిని మరిచి మరి ఆ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తూ ఉంటారు. అలా టాయిలెట్ లో గంటలకొద్ది కాలక్షేపం చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా యువత తెలియకుండానే ఈ తప్పును చేస్తోంది. అందుకే తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లల్ని పదేపదే తిడుతూ ఉంటారు. అయితే టాయిలెట్ క్రిములకు ప్రత్యేకమైన నిలయం అని చెప్పవచ్చు. కంటికి కనిపించని సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి.
టాయిలెట్ సీటులోని ప్రతి చదరపు అంగుళం మీద 50 కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. దీని వల్ల మీరు ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది. అందుకే టాయిలెట్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. మరి టాయిలెట్లు ఎక్కువసేపు ఉండడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..మహిళలు ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడతారు. ఇది ఎక్కువగా టాయిలెట్ సీటు నుంచే వస్తుంది. అపరిశుభ్రమైన టాయిలెట్ సీటు వల్ల సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించడం చాలా సులభం. యూటీఐ నుంచి సూక్ష్మక్రిములు మూత్రాశయం, మూత్రనాళం, కొన్ని సార్లు మూత్రపిండాలకు కూడా సోకుతుంది. అలాగే వజీనాలో బ్యాక్టీరియా అధికంగా చేరడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది.
తద్వారా వజీనా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. దీని వల్ల వజీనా దురద, చికాకు పెడుతుంది. మంటని కూడా కలిగిస్తుంది. అయితే ఇది వస్తే తప్పనిసరిగా వైద్య చికిత్స తీసుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వాపు కారణంగా పురుషుల ప్రొస్టేట్ ఉబ్బుతుంది. ఈ ఇన్ఫెక్షన్ జననేంద్రియాలు, గజ్జల ప్రాంతంలో ఏర్పడుతుంది. నొప్పితో కూడిన బాధ కలిగిస్తుంది. ఫ్లూ వంటి లక్షణాలు చూపిస్తుంది. అపరిశుభ్రమైన టాయిలెట్ సీటు నుంచి లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది పబ్లిక్ రెస్ట్ రూమ్ ల వల్ల మాత్రమే వస్తుందని అనుకోవడానికి లేదు. వ్యక్తిగత మరుగుదొడ్లు శుభ్రంగా లేనివి ఎస్టీడీ ఇన్ఫెక్షన్ కి కారణమవుతాయి. ఇవి ఎక్కువగా చర్మం నుంచి చర్మానికి వ్యాపిస్తాయి. ఒకరకంగా అంటు వ్యాధి కిందకి వస్తుంది. కాబట్టి టాయిలెట్ సీటు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే ఈ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. బాత్ రూమ్ వినియోగించిన తర్వాత తప్పని సరిగా చేతులని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా టాయిలెట్ కి వెళ్ళినప్పుడు వీలైనంత తొందరగా ముగించుకుని బయటకు వచ్చేయడం మంచిది.
Related News
Smoke In Train Toilet: రైలు టాయిలెట్లో అసాంఘిక కార్యకలాపాలు
భారతీయ రైలులో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఇటీవలి కాలంలో రిజర్వేషన్ కోచ్ లలో ఇతరులు ఏక్కి ఇబ్బందులు సృష్టించడం వెలుగు చూసింది. మరికొన్ని చోట్ల అయితే తోటి ప్రయాణికులు ఉన్నారన్న సోయి మరిచి ముద్దులతో రెచ్చిపోయిన ఘటనలు వెలుగు చూశాయి.