Winter: చలికాలంలో ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం!
చలికాలంలో తెలిసి తెలియకుండా కూడా జుట్టు విషయంలో కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Thu - 14 November 24

చలికాలం మొదలయ్యింది. రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. దాంతోపాటు అనేక రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాంతోపాటు అందానికి సంబంధించిన సమస్యలు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. చలికాలంలో ముఖం పగిలి చర్మం పొడిబారి అంద విహీనంగా కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా చలికాలంలో జుట్టు చిట్లిపోయి దారుణంగా మారుతూ ఉంటుంది. చలికాలంలో మనం చేసే తప్పులే జుట్టు సమస్యలకు దారి తీస్తాయని అంటున్నారు. కాగా చలికాలం చాలా మంది వేడి నీటతో స్నానం చేయడానికి ఇష్టపడుతుంటారు.
చలిలో వేడి నీటితో తల స్నానం చేయడం మంచిది కాదని నిపుణులు నిపుణులు చెబుతున్నారు. బాగా వేడి నీటితో తల స్నానం చేస్తే నిజానికి చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. అయితే దీనివల్ల జుట్ట ఆరోగ్యం దెబ్బతింటుందట. దీనికి కారణం తలపై చర్మం పొడిబారడమే అంటున్నారు. ఈ కారణంగా వెంట్రుకలు రాలిపోతాయట. అందుకే వీలైనంత వరకు గోరు వెచ్చిన నీటితోనే తల స్నానం చేయడం ఉత్తమం అని చెబుతున్నారు. అలాగే రోజూ తల స్నానం చేయడం కూడా మంచిది కాదట. ప్రతీరోజూ తల స్నానం చేస్తే జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. దీంతో జుట్టు ఎండిపోయి రాలిపోతాయి. అందుకే జుట్టు హైడ్రేట్‌గా ఉండడానికి మంచి కండీషనర్ లను ఉపయోగించాలి.
తలపై చర్మం పొడిబారితో చుండ్రు సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే చలికాలంలో ఎండలో ఎక్కువ సేపు ఉంటుంటారు. అయితే ఇది కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. చలికాలంలో జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉండాలంటే బయటకు వెళ్లిన సమయంలో స్కార్ఫ్ లేదా టోపీలతో జుట్టును కవర్ చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే తల స్నానం చేసిన తర్వాత జుట్టును టవల్ తో ఎక్కువగా రుద్ద కూడదట. ఇక తల స్నానం చేసిన తర్వాత జుట్టు త్వరగా ఆరాలనే ఉద్దేశంతో హెయిర్ డ్రయర్లను ఉపయోగించకూడదు. ఇది జుట్టు డ్రై గా మారడానికి కారణమవుతుందని చెబుతున్నారు.