Yellow Teeth: గార పట్టిన పళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో దంతాలు మెరవడం ఖాయం!
పసుపుపచ్చని దంతాలతో ఇబ్బంది పడుతున్నవారు, గార తొలగించుకోవాలి అనుకుంటున్నారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు అని చెబుతున్నారు నిపుణులు.
- By Anshu Published Date - 05:00 PM, Fri - 23 May 25

చాలామందికి దంతాలపై గార లాంటిది ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా గార ఏర్పడడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. పళ్ళు సరిగా శుభ్రం చేసుకోకపోవడం, నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడం, అలాగే కొన్ని చెడు అలవాట్ల కారణంగా కూడా ఇలా గార ఏర్పడుతూ ఉంటుంది. ఈ గార తొలగించుకోవడానికి రకరకాల లిక్విడ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ పసుపు పచ్చని దంతాల కారణంగా స్వేచ్ఛగా నవ్వలేకపోతూ ఉంటారు. నలుగురిలోకి వెళ్లాలన్నా నలుగురితో మాట్లాడాలి అన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.
కొందరికి అయితే దంతాలపై పూర్తిగా అల్లుకుపోయి పళ్ళు పసుపు పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. అయితే మీరు కూడా ఇలా గార పట్టిన పళ్లతో ఇబ్బంది పడుతున్నట్టయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. పసుపు పచ్చని దంతాలు తెల్లగా మారడం కోసం ముందుగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దానిపై పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయను అయిదు లేదా ఆరు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక గ్లాసు నీటిని వేసి నీరు బాగా వేడెక్కిన తర్వాత ఆ నీటిలోకి అల్లం నిమ్మకాయ ముక్కలను వేయాలి.
ఇవి బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ నీటిని వడపోసి పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ లవంగాల పొడి ఒక టేబుల్ స్పూన్ చార్కోల్ పౌడర్ మరొక టేబుల్ స్పూన్ టూత్ పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలట. ఈ మిశ్రమాన్ని కలపడం కోసం వేడి చేసి వడపోసుకున్న నీటిని కలపాలట. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో బాగా పళ్ళను తోమాలట. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల కొద్ది రోజులలోనే మీ పళ్ళపై ఉన్నటువంటి పసుపు మరకలు తొలగిపోయి దంతాలు చాలా తెల్లగా మెరిసిపోతాయట. ఈ రెమిడి ఎంతో ఎఫెక్టీవ్ గా పని చేస్తుందని కొద్ది రోజుల్లోనే పళ్ళపై గార తొలగిపోతుందని చెబుతున్నారు.