Sprouts on Empty Stomach: ఖాళీ కడుపుతో మొలకెత్తిన గింజలు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయ్?
మొలకెత్తిన గింజలు తినడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. వాటిల్లో ఉండే విటమిన్లు ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
- By Anshu Published Date - 07:30 AM, Thu - 7 July 22

మొలకెత్తిన గింజలు తినడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. వాటిల్లో ఉండే విటమిన్లు ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో మొలకెత్తిన పప్పులు లేదా మొలకెత్తిన ధాన్యాలు వంటివి పోషకాహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అయితే మొలకెత్తిన గింజలను ఉదయాన్నే తినడం వల్ల శరీరంలోని అజీర్ణం సమస్య తగ్గి,రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. మొలకెత్తిన విత్తనాలు ఉండే పీచు పదార్థం ఉదర సమస్యలను దూరం చేస్తుంది.
ఇక వీటిలో ప్రోటీన్,ఫైబర్,మెగ్నీషియం,ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, ఐరన్,మినరల్స్,యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ,బి,విటమిన్ సి,విటమిన్ ఈ లు ఉంటాయి. ఈ వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. మరి మూలకెత్తిన విత్తనాలు ఇంకా ఏ లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మొలకెత్తిన గింజలను తినవచ్చు. ఉదర సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.
ఇక వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణ క్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదేవిధంగా పొట్ట సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. బరువు తగ్గాలి అనుకున్న వారు ప్రతి రోజు మొలకెత్తిన విత్తనాలను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. అదేవిధంగా మొలకెత్తిన విత్తనాలు ఉదయాన్నే తీసుకోవడం వల్ల కూడా గుండెకు మేలు జరుగుతుంది. తద్వారా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మొలకెత్తిన గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లు గుండె సంబంధిత సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి.