Mulberry Benefits: మల్బరీతో ఎన్ని ఉపయోగాలో తెలుసా.. అలాంటి రోగాలన్నీ మాయం!
సాధారణంగా పండ్లు అంటే పోషకాల నిధిగా చెబుతూ ఉంటారు. ప్రతిరోజు పండ్లను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం తెలిసిందే. అలా అనేక పోషక విలువలో కలిగిన పండ్లలో మల్బరీ పండ్లు కూడా ఒకటి అని చెప్పవచ్చు.
- By Anshu Published Date - 08:45 AM, Thu - 8 September 22

సాధారణంగా పండ్లు అంటే పోషకాల నిధిగా చెబుతూ ఉంటారు. ప్రతిరోజు పండ్లను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం తెలిసిందే. అలా అనేక పోషక విలువలో కలిగిన పండ్లలో మల్బరీ పండ్లు కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఈ మల్బరీ పండ్లు చూడటానికి చిన్నగా చిన్న సైజులో ఉన్న ద్రాక్ష గుత్తి లాగా ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి చేసే ప్రయోజనాలు మాత్రం అనేకం అని చెప్పవచ్చు. మరి మల్బరీ పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మల్బరీ పండ్లలో విటమిన్ ఏ, బి, సి, డి లు ఉంటాయి. వీటితో పాటు క్యాల్షియం, ఐరన్, జింక్, ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే వారంలో నాలుగు సార్లు ఈ పండును తీసుకుంటే కంటిచూపు కూడా పెరుగుతుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా ఈ పండ్లు మధుమేహాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మల్బరీ పండ్లలో అనేక రకాల పోషకాలతో పాటుగా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.
వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఈ పండ్లు చర్మం పై ముడతలను తగ్గించి చర్మం యవ్వనంగా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. అలాగే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తికిని పెంపొందిస్తుంది. మల్బరీని మనం తినే ఆహారంలో చేర్చుకోవటం ద్వారా రక్తంలో గ్లూకోజ్ గ్లూకోజ్ స్ధాయిలు తగ్గుతాయని చెబుతున్నారు. డయాబెటిస్ వల్ల వచ్చే బరువును నియంత్రించటంలో మల్బరీ ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్ధ మెరుగుపరిచేందుకు బాగా పనిచేస్తాయి.