Shiver During Urination:మూత్ర విసర్జన సమయంలో “వణుకు”.. ఎందుకు.. ఏమిటి.. ఎలా ?
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యూటీఐ) అంటే.. మూత్ర వ్యవస్థలోని ఏదైనా భాగానికి ఇన్ఫెక్షన్ సోకడం.
- By Hashtag U Published Date - 06:30 PM, Thu - 25 August 22
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యూటీఐ) అంటే.. మూత్ర వ్యవస్థలోని ఏదైనా భాగానికి ఇన్ఫెక్షన్ సోకడం. ఇది మూత్రాశయం, మూత్రనాళం, మూత్రమార్గం లేదా మూత్రపిండాలు కావచ్చు. మూత్ర నాళాన్ని.. దిగువ మూత్ర మార్గం , ఎగువ మూత్ర మార్గం అనే రెండు భాగాలుగా విభజించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ మొదట మూత్రాశయం, మూత్రనాళంతో కూడిన దిగువ మార్గంపై దాడి చేసి, ఆపై మూత్రాశయం, మూత్రపిండాలకు సోకుతూ పైభాగానికి వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల కొందరిలో మూత్రం విసర్జన చేసేటప్పుడు మంట లేదా వణుకు సంభవిస్తుంది. ఈ రుగ్మతతో ముడిపడిన పలు కీలక వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వణుకు ఎవరికి వస్తుంది ?
కేవలం చలి వాతావరణం వల్లే వణుకు వస్తుంది అనుకోవడం తప్పు. వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, ఏదైనా భయంతో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు కూడా వణుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. డైపర్ మార్చేటప్పుడు కూడా చిన్న పిల్లలు వనకడాన్ని మనం ఎన్నోసార్లు చూసి ఉంటాం. పిల్లల నుంచి పెద్దల వరకు ఏ వయసు వారికైనా మూత్రం పోసేటప్పుడు వణుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి ఎవరూ అతీతులు కాదు.అయితే ఈ సమస్య మహిళలతో పోలిస్తే.. పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
కారణాలు ఏమిటి?
కాలి గజ్జల భాగం నుంచి తొడ భాగం వరకు శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా హెచ్చుతగ్గులకు గురైన సందర్భాల్లో కూడా.. మూత్ర విసర్జన టైంలో వణుకు వస్తుంటుంది. మూత్రం పోయడానికి అండర్ గార్మెంట్ విప్పగానే ప్రయివేట్ పార్ట్స్ పై చల్లటి గాలి తాకగానే వణుకు పుడుతుంది. వణుకు వచ్చే వారిలో అకస్మాత్తుగా శరీర ఉష్ణోగ్రత పెరిగే ఛాన్స్ ఉంటుంది. శరీరంలో నుంచి మూత్రం వేడివేడిగా బయటికి వెళ్ళిపోయిన సందర్భాల్లోనూ శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం ప్రారంభిస్తుంది.
నరాల వ్యవస్థ లో స్పందనలు..
* మన శరీరంలోని నరాల వ్యవస్థ రెండు రకాలు. మొదటిది.. కేంద్ర నాడీ వ్యవస్థ (సెంట్రల్ నర్వస్ సిస్టం), రెండోది పరిధీయ నాడీ వ్యవస్థ (పెరి ఫెరల్ నర్వస్ సిస్టం).
* కేంద్ర నాడీ వ్యవస్థ అనేది మెదడు, వెన్నెముకలోని చర్యలను నియంత్రిస్తుంది. పెరి ఫెరల్ నర్వస్ సిస్టం అనేది మెదడు నుంచి ఇతర శరీర భాగాలకు సిగ్నల్స్ తీసుకొని వెళ్తుంది.
* పెరి ఫెరల్ నర్వస్ సిస్టంకు చెందిన అటానమిక్ నర్వస్ సిస్టం (ఏ ఎన్ ఎస్).. మన నిర్ణయాలతో సంబంధం లేకుండా జరిగే జీవక్రియలను నియంత్రిస్తుంది.
* అటానమిక్ నర్వస్ సిస్టంను రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి “సింపథిక్ నర్వస్ సిస్టం”, మరొకటి “పారా సింపథెటిక్ సిస్టం”.
* “సింపథిక్ నర్వస్ సిస్టం” అనేది.. మనల్ని నిద్ర లేపే, అలర్ట్ చేసే పనులు చేస్తుంటుంది.
* “పారా సింపథెటిక్ సిస్టం” అనేది.. నిద్ర పుచ్చే పనిని, విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనను రేకెత్తిస్తుంది.
* మీ మూత్రాశయం మూత్రంతో నిండిపోయిన సందర్భాల్లో వెన్నెముకలోని నరాలను “పారా సింపథెటిక్ సిస్టం” యాక్టివేట్ చేస్తుంది.
* వెన్నెముకలోని నరాలను సెక్రల్ నర్వ్స్ అని పిలుస్తారు. ఇవి మూత్రాశయంలో నిండిపోయిన మూత్రాన్ని బయటికి నెట్టేలా మూత్రాశయం గోడల్లో చలనం సృష్టిస్తుంది.
* ఈవిధంగా మూత్రం బయటికి విడుదలయ్యే సందర్భంలో బీపీ (రక్త పోటు) తగ్గిపోతుంది.ఈ సమయంలో బీపీని కంట్రోల్ లో ఉంచేందుకు కైటే కోలమైస్ అనే న్యూరో ట్రాన్స్ మీటర్ ను “సింపథిక్ నర్వస్ సిస్టం” మన శరీరంలో విడుదల చేస్తుంది.
* దీనివల్ల నాడీ వ్యవస్థ లో రెండు మిక్స్డ్ సిగ్నల్స్ విడుదల అవుతాయి. వీటి కారణంగా మూత్రం చేసే సమయంలో వణుకు తరహా ఫీలింగ్ కలుగుతుంది.
నిలబడి మూత్రం పోసే వాళ్లలో..
కూర్చుని మూత్రం పోసే వాళ్ళతో పోలిస్తే.. నిలబడి మూత్రం పోసే వాళ్లలో ఆ సమయంలో బీపీ లెవల్స్ బాగా తగ్గిపోతాయి. వారిలో పెద్దఎత్తున కైటే కోలమైస్ విడుదల కావడం వల్ల వణుకు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
Related News
Bathing Vs Peeing : స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తున్నారా ?
Bathing Vs Peeing : శరీరంపై ఉన్న మలినాలను తొలగించేందుకు మనం స్నానం చేస్తుంటాం.