Lemon Water: ఉదయాన్నే భోజనం చేసిన తర్వాత లెమన్ వాటర్ ఏం జరుగుతుందో మీకు తెలుసా?
భోజనం తిన్న తర్వాత లెమన్ వాటర్ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 04:00 PM, Fri - 25 October 24

లెమన్ వాటర్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇతర సీజన్లతో పోల్చుకుంటే ఎండాకాలంలో ఈ లెమన్ వాటర్ ని ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఎండలు బాగా మండిపోతున్నప్పుడు శరీరం డిహైడ్రేట్ అయినప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు ఈ లెమన్ వాటర్ ని ఎక్కువగా తాగుతూ ఉంటాం. అయితే ఎప్పుడైనా ఉదయాన్నే భోజనం చేసిన తర్వాత లెమన్ వాటర్ ని తాగారా. మరి అలా తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తిన్న వెంటనే నిమ్మరసం తాగితే మీ జీర్ణక్రియ బాగుంటుందట.
నిమ్మరసం మీ జీర్ణక్రియ వేగాన్ని మెరుగుపరుస్తుందని, దీంతో మీకు జీర్ణ రసాలు, ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుందని, దీనివల్ల మీకు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర pH స్థాయిని సమతుల్యం చేయడానికి బాగా సహాయపడుతుందట. అయితే తిన్న తర్వాత లెమన్ వాటర్ ను తాగితే గ్యాస్ట్రిక్ యాసిడ్ సమస్య తగ్గిపోతుందని చెబుతున్నారు. కాగా నిమ్మకాయలో విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుందట. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుందని చెబుతున్నారు. తిన్న తర్వాత లెమన్ వాటర్ ను తాగితే మీ చర్మం అందంగా మెరిసిపోతుందట.
కాగా నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఆక్సీకరణ నష్టం లేదా ఒత్తిడిని తగ్గిస్తుందట. అలాగే మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుందని చెబుతున్నారు. నిమ్మకాయ ఆమ్లంగా ఉన్నప్పటికీ ఇది గ్యాస్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుందట. నిమ్మకాయ వాటర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రిఫ్లక్స్ వ్యాధి నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు.
కాగా లెమన్ వాటర్ ఒక గొప్ప డిటాక్స్ డ్రింక్. ఇది మన శరీరం నుంచి టాక్సిన్స్, హానికరమైన కణాలను బయటకు పంపడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని చెబుతున్నారు. అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుందట. కాబట్టి ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగాలి అంటే భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే మంచి ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు.