Okra: ప్రెగ్నెన్సీ సమయంలో బెండకాయను తినవచ్చా..తింటే ఏం జరుగుతుందో తెలుసా?
బెండకాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెండకాయలు విటమిన్ సి లభిస్తుంది. ఈ
- By Nakshatra Published Date - 09:30 AM, Tue - 25 October 22
బెండకాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెండకాయలు విటమిన్ సి లభిస్తుంది. ఈ బెండకాయలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే బెండకాయలు తింటే తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి. చాలామంది బెండకాయను ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే బెండకాయను తినడం ఆరోగ్యానికి మంచిదే అలాగే కొన్ని రకాల సమస్యలు కూడా దూరం అవుతాయి అంటున్నారు మన వైద్య నిపుణులు. అదేవిధంగా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా బెండకాయలను తీసుకోవచ్చని అంటున్నారు.. బెండకాయను ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయల్లో మెగ్నీషియం, విటమిన్ కె, పొటాషియం, ఐరన్,జింక్,కాపర్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ ఈ, మెగ్నీషియం, సోడియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ అలాగే మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఈ బెండకాయను తప్పకుండా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బెండకాయ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది. బెండకాయ నుంచి గర్భిణీ స్త్రీలకు కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి..
ఉండే విటమిన్ సి తల్లికి మాత్రమే కాకుండా బిడ్డ రోగనిరోధక శక్తికి కూడా బాగా పనిచేస్తుంది. ఇది కడుపులోని బిడ్డ కండరాలను ఎముకలను బలంగా చేస్తుంది. బెండకాయలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ ల తల్లి నీ కడుపులో ఉన్న బిడ్డను రక్షిస్తాయి. అలాగే బెండకాయలు ఫినాలిక్ కెరోటినాయిడ్ సమ్మేళనాలు పుష్కలంగా లభిస్తాయి. బెండకాయలు తినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ పెద్ద ప్లేగు క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా బయటపడవచ్చు. అంతేకాకుండా అధిక బరువును తగ్గించడంలో బెండకాయ బాగా పనిచేస్తుంది. చేదంలో పేరుకుపోయిన చెరుకు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. బెండకాయ తినడం వల్ల డయాబెటిస్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
Related News
Ram Charan-Upasana: ఏంటి!ఉపాసనది సహజం గర్భం కాదా.. అసలు రహస్యం ఇదే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. ఈ జంటకు