Peanut Chikki : పల్లిపట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
పల్లిపట్టి.. వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఇవి ఎంతో మే
- By Nakshatra Published Date - 10:30 PM, Tue - 15 August 23
పల్లిపట్టి.. వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు కూడా వీటిని తరచుగా తీసుకోమని చెబుతూ ఉంటారు. బెల్లం, పల్లీలు కలిపిన పల్లిపట్టి తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పల్లిపట్టి చాలామంది ఇష్టంగా తింటారు. వీటిని నిజానికి సాంప్రదాయ స్వీట్ అని చెప్పవచ్చు. పల్లిపట్టీల్లో విటమిన్స్, ప్రోటీన్స్ శరీరానికి చాలా మేలు చేస్తాయి. బెల్లంలోని ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
అంతేకాదు, ఈ రుచికరమైన వంటకం జలుబు సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. ఈ రుచికరమైన హెల్దీ వేరుశనగలు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడమే కాకుండా మీ గుండెని కాపాడుతుంది. ఇందులో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ముఖ్యంగా ఒలీక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఈ వేరుశనగలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన రక్త లిపిడ్ ప్రొఫైల్‌కి సపోర్ట్ చేయడంతో పాటు స్ట్రోక్ సహా అథెరోస్క్లెరోసిస్‌ని నిరోధించడంలో సహాయపడుతుంది. వేరుశనగలు, బెల్లంతో తయారైన ఈ పల్లిపట్టిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా నరాల సంబంధిత వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఈ చిన్న చిక్పీ రక్తం గడ్డకట్టడాన్ని బలహీనపరుస్తుంది.
పల్లీలు అమైనో ఆమ్లాల యొక్క అద్భుతమైన మూలం. ఇందులోని అమైనో యాసిడ్స్ హార్మోన్లని పెంచి, ఇమ్యూనిటీని పెంచుతాయి. పిల్లలు కూడా డౌట్ లేకుండా పల్లీలను క్రంచీ స్నాక్‌గా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే, కాసేపటికి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. పల్లీలు బెల్లంతో కలిపి తయారు చేసిన పల్లిపట్టి ఆరోగ్యాన్నివ్వడమే కాకుండా చర్మ సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల సోరియాసిస్, ఎగ్జిమా వంటి సమస్యల నుంచి మన చర్మాన్ని రక్షిస్తాయి. ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం, జింక్ చర్మాన్ని లోపలి నుండి కాపాడతాయి. పల్లీల్లో సెలీనియం, బెల్లంలో మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో రెండూ ప్రభావవంతంగా ఉంటాయి. ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్స్ రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఎముకలని బలంగా చేస్తాయి.
Related News
Peanut Chikki : షాప్స్ లో అమ్మే పల్లిపట్టి.. ఇంట్లో రుచిగా ఎలా చేయాలంటే..? పల్లిపట్టి ప్రయోజనాలు..
మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా పల్లిపట్టి తయారుచేసుకోవచ్చు.