Orange: చలికాలంలో ఆరెంజ్ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
చలికాలంలో ఆరెంజ్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:04 PM, Sat - 23 November 24

చలికాలంలో మనకు కొన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ లభిస్తూ ఉంటాయి. వాటిని తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చలికాలంలో తీసుకోవాల్సిన పండ్లలో ఆరెంజ్ కూడా ఒకటి. మరి చలికాలంలో ఆరెంజ్ తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆరెంజ్ లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ సి ఎంతో అవసరం.
జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు నియంత్రణకు ఫైబర్ చాలా ముఖ్యమైన పోషకం. ఆరెంజ్ లో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తగ్గించి, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి పొటాషియం సహాయపడుతుందని చెబుతున్నారు. ఆరెంజ్ లో పొటాషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందట. అలాగే శరీరంలోని కణాలను నష్టం నుంచి కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు ఆరెంజ్ లో పుష్కలంగా ఉంటాయట. ఇవి ముసలితనం వల్ల కలిగే సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.
ఆరెంజ్‌లో ఉండే విటమిన్ సి చర్మాన్ని మృదువుగా, మెరిసిపోయేలా చేస్తుందట. బీటా కెరోటిన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఆరెంజ్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ లను నిరోధించడంలో సహాయపడతాయట. కాగా ఆరెంజ్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి మన రోగ నిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. శీతాకాలంలో ఈ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆరెంజ్ తినడం చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను నష్టం నుంచి కాపాడి, ముసలితనం వల్ల కలిగే సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు.