Lychee Fruit: లిచీ పండ్ల వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
లిచీ పండ్ల వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:30 PM, Sun - 18 August 24

లిచీ పండ్లు.. మనలో చాలా తక్కువ మంది మాత్రమే వీటిని తిని ఉంటారు. మార్కెట్లో కూడా ఈ లిచీ పండ్లు చాలా తక్కువగా లభిస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి బయట ఎర్ర రంగులో ఉండి లోపల గుజ్జు మొత్తం తెల్లగా ఉంటుంది. చాలామందికి వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక వీటిని తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు. మరి లిచీ పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లిచీ పండ్లు ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. ఈ పండ్లలో విటమిన్స్, ఖనిజాలకి గొప్ప మూలమని చెప్పవచ్చు.
వీటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, లిపిడ్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, విటమిన్ సి లాంటి అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిని తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి వర్షాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. లిచీలోని పాలీశాకరైడ్స్, ఫ్లేవనైడ్స్ వంటి సమ్మేళనాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. వీటిని మీరు డ్రైడ్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ లా కూడా తీసుకోవచ్చు. లిచీ పండ్లలో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. అలాగే ఈ పాలీఫెనాల్స్ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది.
వీటిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఉండే తరచుగా మూత్ర విసర్జన, ఎక్కువగా దాహం, అతిగా ఆకలి వేయడం కంట్రోల్ అవుతాయట. ఇవి మెటబాలిజం రేటుని కూడా రెగ్యులేట్ చేస్తాయని చెబుతున్నారు. లిచీ పండ్లలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. దీనికి కారణం అందులోని పాలీఫెనాల్స్, పాలీశాకరైడ్స్. వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల ఆపుతాయి. అదేవిధంగా లీచీ పండ్లు బ్రెస్ట్ క్యాన్సర్‌ని కూడా కంట్రోల్ చేయగలవు. వీటితో పాటు యాంటీ క్యాన్సర్ గుణాల కారణంగా లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
అలాగే లిచీ పండ్లు తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది. వచ్చే గుండె సమస్యలకి బీపినే కారణం. బీపిని కంట్రోల్ చేసే లిచీ పండ్లు తినడం వల్ల బీపి కంట్రోల్ అయి గుండె ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా వీటిలోని లో డెన్సిటి లిపో ప్రోటీన్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుందట. ఈ పండ్లను నేరుగా అయినా తీసుకోవచ్చు లేదా డ్రైఫ్రూట్ల అయినా తీసుకోవచ్చు. అలాగే జ్యూస్‌లా కూడా తీసుకోవచ్చు. మార్కెట్లో ఈ పండ్లతో తయారైన పిల్స్ కూడా దొరుకుతాయి.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.