Ulcer: ఈ వంటింటి చిట్కాలతో నోటిపూతకు చెక్ పెట్టండిలా?
ప్రస్తుత రోజుల్లో చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా నోటిపూత సమస్యతో బాధపడుతున్నారు. నోటి పూత సమస్య కారణంగా ఎటువంటి పదార్థాలు తినాలి అన్నా కూ
- By Anshu Published Date - 06:45 PM, Tue - 30 May 23

ప్రస్తుత రోజుల్లో చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా నోటిపూత సమస్యతో బాధపడుతున్నారు. నోటి పూత సమస్య కారణంగా ఎటువంటి పదార్థాలు తినాలి అన్నా కూడా నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలాంటి సమస్యలతో తరచుగా ఇబ్బంది పడేవారు క్రమం తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అలెర్జీ, హార్మోన్లలో మార్పు, కడుపు ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. కాబట్టి నోటిలో బొబ్బలు వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
నోటిపూత వల్ల తినడానికి, తాగడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. నోటి పూత వచ్చినప్పుడు చాలామందికి లో జ్వరం కూడా వస్తూ ఉంటుంది. మరి నోటిపూతను మన వంటింటి చిట్కాలతో ఎలా పోగొట్టుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి ఆకులు.. తులసి మొక్కలు ప్రతి ఇంట్లో సర్వసాధరణంగా ఉంటాయి. ఈ ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలు దాగి ఉంటాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు నోటి పూతల నుంచి రక్షించి ఉపశమనం కలిగిస్తాయి.
గసగసాలు.. ప్రస్తుతం చాలా మంది నోటిలో బొబ్బలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఒక చెంచా గసగసాలు గోరువెచ్చని నీటితో ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఈ సమస్యల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. కొబ్బరి నూనె.. కొబ్బరి నూనె నోటిపూత, వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నూనెను నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా నోటి అల్సర్లను కూడా నయం చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. లికోరైస్.. లైకోరైస్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నోటి అల్సర్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జామపండు గ్రైండ్ చేసి అందులో ఒక చిన్న చెంచా తేనె కలిపి నోటిపూత ఉన్న చోట అప్లై చేసుకోవాలి. దీని వల్ల ఆ సమస్య నుంచి తొందరగా రిలీఫ్ అవ్వవచ్చు.