Blood in Urine: మూత్రం రంగు మారిందా.. అయితే మీరు ఆ ప్రమాదంలో పడ్డట్టే?
సాధారణంగా మూత్రం తెలుపు లేదంటే లేత పసుపు రంగులో ఉంటుంది. కొన్నిసార్లు ఆరోగ్యం బాగో లేనప్పుడు ఎండకు
- By Nakshatra Published Date - 06:30 AM, Thu - 15 December 22
సాధారణంగా మూత్రం తెలుపు లేదంటే లేత పసుపు రంగులో ఉంటుంది. కొన్నిసార్లు ఆరోగ్యం బాగో లేనప్పుడు ఎండకు ఎక్కువగా తిరిగినప్పుడు డార్క్ ఎల్లో కలర్ లో కూడా వస్తూ ఉంటుంది. అయితే మూత్రం సాధారణంగా కలర్ లో కాకుండా వివిధ రకాల కలర్లో రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. మూత్రం సాధారణ రంగులో కాకుండా వివిధ రకాల రంగులలో వచ్చినప్పుడు అది క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగానికి కారణం కావచ్చు. అటువంటి సమయంలో నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే మనం తినే ఆహార పదార్థాల వల్ల కూడా మూత్రం రంగు మారుతూ ఉంటుంది. అయితే చాలామంది మూత్రం రంగు మారినప్పుడు ఏమి కాదు అని కొందరు వదిలేస్తే ఇంకొందరు బయటకు చెప్పుకోడానికి సిగ్గుపడుతూ ఉంటారు.
కానీ అలా సిగ్గుపడి చెప్పకపోవడం వల్ల అది మీ ప్రాణాల మీద కూడా రావచ్చు. మూత్రం రంగు మారడం అస్సలు మంచిది కాదు. కొందరికైతే కొన్ని సమయాల్లో మూత్రంలో రక్తం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంటే మూత్రం లేత ఎరుపు రంగులోకి మారుతూ ఉంటుంది. దీన్ని సమయానికి గుర్తించకపోతే అది మీ ప్రాణాలమీదికే వస్తుంది. మూత్రం రంగు మారడం ముందుగానే గమనిస్తే ప్రాణాంతకల వ్యాధుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. మూత్రం రక్తం రంగులో రావడానికి మూత్రాశయ క్యాన్సర్ కూడా కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. దీనినే హెమటూరియా అని పిలుస్తారు. కాగా మూత్రం ఎర్రగా మారడం క్యాన్సర్ కు సంబంధించింది మాత్రమే కాకుండా ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.
ప్రోస్టేట్ పెద్దదిగా ఉన్నప్పుడు మూత్రాశయం, మూత్రశాయం యొక్క సంక్రమణ ఉన్నప్పుడు కూడా మూత్రంలో రక్తం కనిపిస్తుంది. అలాగే ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు కూడా మూత్రం నుంచి రక్తం బయటకు వెళుతుంది. ఇది సర్వసాధారణం. ఎక్కువ సేపు పరుగెత్తడం, ఈతకొడ్డటం మొదలైన కార్యకలాపాల వల్ల మూత్రంలోకి రక్తం ప్రవేశిస్తుంది. అలాగే కొన్ని మందుల వల్ల మూత్రంలో రక్తం రావడానికి కారణమవుతుంది. బ్లాక్ బెర్రీలు, కొన్ని ఎరుపు ఆహార పదార్థాలు కూడా మూత్రం రంగును ఎరుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి.
Related News
Urination Problems : మూత్ర విసర్జనలో నురగ, వాసన వస్తుందా ? ఇవే కారణాలు కావొచ్చు..
మూత్ర విసర్జనలో పెద్దమొత్తంలో ప్రొటీన్లు, రసాయనాలు విడుదలవుతాయి. కాబట్టి మీరు తరచూ నీరు తాగాలి. నీరు తక్కువగా తాగినా.. డీహైడ్రేషన్ కు గురై.. మూత్రంలో నురగలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.