Music : సంగీతం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా..? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే !!
Music : అధిక శబ్దంతో పాటలు వినడం వల్ల చెవులకు హాని కలగొచ్చు, మెదడుపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. విషాదకర గీతాలు నిరంతరం వింటే మానసికంగా దుఃఖం పెరిగే అవకాశమూ ఉంది
- By Sudheer Published Date - 06:40 AM, Mon - 18 August 25

సంగీతం (Music ) అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా శారీరకంగా, మానసికంగా మనిషికి అనేక లాభాలు చేకూర్చే అద్భుత ఔషధం అని నిపుణులు చెబుతున్నారు. మన మెదడులోని హిప్పోక్యాంపస్, లింబిక్ సిస్టమ్ వంటి భాగాలను ఉత్తేజితం చేయడం ద్వారా జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు మెదడు ఎదుగుదలకు, ఆలోచనా శక్తి అభివృద్ధికి తోడ్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే, సంగీతం మనసును ప్రశాంతపరచి జీవన నాణ్యతను మెరుగుపరచే సాధనంగా మారుతుంది.
Number Plate: దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ కాస్ట్ ఎంతో తెలుసా?!
శారీరక ఆరోగ్యంలో కూడా సంగీతం (Music ) కీలక పాత్ర పోషిస్తుంది. మెల్లగా వినే పాటలు గుండె స్పందన రేటు, రక్తపోటును తగ్గిస్తాయి. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిని తగ్గించి, సెరోటోనిన్, ఎండార్ఫిన్స్ స్థాయిలను పెంచి సంతోషాన్ని కలిగిస్తాయి. వ్యాయామం చేసే సమయంలో ఉత్తేజపరిచే పాటలు వింటే శక్తి పెరిగి ఎక్కువసేపు శ్రమించవచ్చు. అలాగే సంగీతం వినడం వల్ల నొప్పి తగ్గి, రోగనిరోధక శక్తి పెరిగి, మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది.
Naresh : విలన్ గా మారబోతున్న మహేష్ బ్రదర్ !!
అయితే ప్రతి విషయానికీ ఒక పరిమితి ఉన్నట్లే సంగీతానికి కూడా ఉంది. అధిక శబ్దంతో పాటలు వినడం వల్ల చెవులకు హాని కలగొచ్చు, మెదడుపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. విషాదకర గీతాలు నిరంతరం వింటే మానసికంగా దుఃఖం పెరిగే అవకాశమూ ఉంది. కాబట్టి సరైన సమయంలో, సరైన రకమైన సంగీతాన్ని ఆస్వాదిస్తే మాత్రమే అది శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మొత్తానికి సంగీతం జీవితం లయబద్ధం చేస్తూ, ఆరోగ్యానికి స్నేహితుడిగా నిలుస్తుంది.