Largest Bacteria : అతిపెద్ద సైజులో ఉండే బ్యాక్టీరియా గుర్తింపు
నేరుగా మనిషి కంటికి కనిపించేంత సైజులో ఉన్న బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు కరేబియన్ దీవుల్లో గుర్తించారు
- By Hashtag U Published Date - 03:56 PM, Fri - 24 June 22
నేరుగా మనిషి కంటికి కనిపించేంత సైజులో ఉన్న బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు కరేబియన్ దీవుల్లో గుర్తించారు. దానికి తయో మార్గరిట మ్యాగ్ని ఫికా (Thiomargarita magnifica) అని పేరు పెట్టారు. సాధారణంగా బ్యాక్టీరియా 1 నుంచి 5 మైక్రో మీటర్ల పొడవు ఉంటుంది. కానీ ఇది 10,000 మైక్రో మీటర్ల పొడవు ఉందని గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు “జర్నల్ సైన్స్” లో ప్రచురితం అయ్యాయి.గయానాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్రెంచ్ వెస్ట్ ఇండీస్ శాస్త్రవేత్త ఒలివియర్ గ్రోస్ ఈ బ్యాక్టీరియా ను గుర్తించిన పరిశోధకుల బృందానికి నేతృత్వం వహించారు.ఇంత పెద్ద సైజులో ఉండటంతో తొలుత ఆయన కూడా దాన్ని బ్యాక్టీరియా అని భావించలేదు. మైక్రో స్కోప్ లతో పరిశీలించాక, జెనెటిక్ అనాలిసిస్ చేశాక.. అది బ్యాక్టీరియా అని నిర్ధారణ కు వచ్చారు. చిత్తడి నేలల్లోని ముత్యపు చిప్పలు, గ్లాస్ బాటిల్స్ ను అతుక్కుని ఈ బ్యాక్టీరియా ఉందని గుర్తించారు.