Karpuravalli : మీ ఇంటి సమీపంలో ఈ ఆకు ఉంటె ఏమాత్రం లైట్ తీసుకోకండి..ఎందుకంటే !!
Karpuravalli : ఇంటి కూరగాయ తోటల్లో సులభంగా పెరిగే ఈ మొక్క ఆకులను వంటల్లో ఉపయోగించడమే కాకుండా నేరుగా తీసుకున్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి
- By Sudheer Published Date - 08:00 AM, Wed - 4 June 25

కర్పూరవల్లి (Karpuravalli) లేదా వామాకు ఆకులు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం కలిగిన ఔషధ మొక్క. ఈ మొక్కను ఇండియన్ బొరేజ్, మెక్సికన్ మింట్ అని కూడా పిలుస్తారు. ఇంటి కూరగాయ తోటల్లో సులభంగా పెరిగే ఈ మొక్క ఆకులను వంటల్లో ఉపయోగించడమే కాకుండా నేరుగా తీసుకున్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా లాంటి లక్షణాల నుంచి ఉపశమనం కలిగించే గుణాలు దీనికి ఉన్నాయి. ఆవిరి రూపంలో వాడినా, ఆకుల రసాన్ని ఛాతీపై రాసినా శ్వాస మార్గాలను శుభ్రపరచడంలో ఇది ఉపయోగపడుతుంది.
Beauty Tips: ముఖంపై ఉన్న మచ్చలు, డార్క్ స్పాట్స్ ఒక్కసారిగా మాయం కావాలంటే ఇలా చేయండి!
ఇది కేవలం శ్వాస సంబంధిత సమస్యలకే కాదు, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా కీలకంగా పనిచేస్తుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఇది సహజ నివారణ. ఆకలి తక్కువగా ఉన్నవారికి ఆకలిని పెంచేందుకు, భోజనం తర్వాత కొన్ని ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు సహాయపడుతుంది. అలాగే, ఈ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయని, ఉప్పు నిల్వలను కరిగించి రాళ్లను తొలగించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
Royal Challengers Bengaluru: 18 ఏళ్ల ఆర్సీబీ కల సాకారం.. ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు!
కర్పూరవల్లి డయాబెటిస్ నియంత్రణలో, నోటి ఆరోగ్య రక్షణలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలున్నాయి, ఇవి నోటి దుర్వాసన, ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్ C సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నొప్పులు, వాపు తగ్గించడంలో సహకరించే ఈ ఆకులు కీళ్ల నొప్పులు, తలనొప్పులు వంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి. అంతేకాకుండా చర్మ రక్షణలోనూ ఈ ఆకులు సహాయపడతాయి. వాపు, దురద, దద్దుర్లు, కీటకాల కాటు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కర్పూరవల్లి కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా చూస్తే కర్పూరవల్లి అనేది మన ఇంట్లో ఉండే ఒక చిన్న మొక్కే కాదు, ఒక సంపూర్ణ ఆరోగ్య వనరుగా నిలుస్తుంది.