Ginger for Hair : జుట్టు పెరుగుదలకు అల్లం.. ఇలా వాడితే ఒత్తైన కురులు మీ సొంతం
అల్లంలో ఉండే జింజెరాల్ అనే పోషకం స్కాల్ప్ లో సర్క్యులేషన్ ను మెరుగు పరచడంలో ఉపయోగపడుతుంది. అలాగే హెయిర్ ఫోలికల్స్ పోషకాలను అందిస్తుంది. ఇందులోని యాంటీ మైక్రోయల్ గుణాలు.. జుట్టు పెరుగుదలను నిరోధించే..
- By News Desk Published Date - 09:17 PM, Thu - 15 February 24
Ginger for Hair : జుట్టు రాలడం.. ఈ సమస్య నేటి యువతలో విపరీతంగా కనిపిస్తోంది. పట్టుమని పాతికేళ్లైనా నిండకుండానే జుట్టంతా ఊడిపోయి బట్టతలలు కనిపిస్తున్నాయి. అమ్మాయిలు కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. చిన్నప్పుడు జుట్టు ఒత్తుగా ఉన్నా.. వయసు పెరిగే కొద్దీ.. రకరకాల ఆయిల్స్, రసాయనాలతో తయారు చేసిన షాంపూల వల్ల జుట్టు ఊడిపోతోంది. జుట్టు రాలే సమస్య నుంచి అల్లం విముక్తిని ఇస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. తలకు రక్తప్రసరణను ప్రేరేపిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
అల్లంలో ఉండే జింజెరాల్ అనే పోషకం స్కాల్ప్ లో సర్క్యులేషన్ ను మెరుగు పరచడంలో ఉపయోగపడుతుంది. అలాగే హెయిర్ ఫోలికల్స్ పోషకాలను అందిస్తుంది. ఇందులోని యాంటీ మైక్రోయల్ గుణాలు.. జుట్టు పెరుగుదలను నిరోధించే చుండ్రు, ఇతర స్కాల్ప్ సమస్యల్ని సైతం నివారిస్తుంది. ఆరోగ్యకరమైన స్కాల్ప్ కు సహాయపడుతుంది.
తలలో రక్తప్రసరణను అల్లం మెరుగుపరుస్తుంది. అదే సమయంలో.. ప్రతి హెయిర్ ఫోలికల్ ను ప్రేరేపిస్తుంది. ఫలితంగా పొడవైన, బలమైన జుట్టు ఏర్పడుతుంది. అల్లంలో ఉండే విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ మీ జుట్టును బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. జుట్టు రాలడాన్ని నిరోధించేందుకు సహాయపడుతాయి.
అల్లం యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను నిరోధించే చుండ్రు, ఇతర స్కాల్ప్ సమస్యల్ని నివారిస్తుంది. మెరుగైన ఫలితం కోసం షాంపూలో అల్లం రసం వేసి.. తలకు పట్టించి మసాజ్ చేసుకోవచ్చు. ఇది సహజమైన కండిషనింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.
తాజా అల్లం ముక్కలో ఉండే ప్రత్యేకమైన నూనెలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు హెయిర్ ఫోలికల్స్ డ్యామేజ్ అవ్వడం, చిట్లడం నుంచి రక్షిస్తాయి. జుట్టుకు అల్లం హెయిర్ మాస్క్ ను కూడా తయారు చేసుకోవచ్చు. తాజా అల్లంను గ్రైండ్ చేసి.. దాని నుంచి రసం తీయాలి. అందులో ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వంటివి కలుపుకుని.. నేరుగా స్కాల్ప్, హెయిర్ కు అప్లై చేసి మసాజ్ చేయాలి. సుమారు 30 నిమిషాల నుంచి 1 గంట వరకూ అలాగే ఉంచుకోవాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
Read Also : Green Apple: తరచూ గ్రీన్ యాపిల్ తీసుకుంటే చాలు ఆ సమస్యలన్నీ పరార్ అవ్వాల్సిందే?
Related News
Hair Growth: కొబ్బరి నూనెలో ఇది కలిపి రాస్తే చాలు.. జుట్టు గడ్డిలా గుబురుగా పెరగాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొంతమందికి అయితే మరీ దారుణంగా కుచ్చులుగా ఎక్కువ మొత్తంలో వెం