Wheat Flour: షుగర్ తగ్గడం కోసం గోధుమ పిండిని ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
షుగర్ ఉన్నవారు ఎక్కువగా గోధుమపిండి ఉపయోగిస్తుంటారు. దీని వల్ల షుగర్ లెవల్స్ తగుతాయని, ఒక్కసారిగా పెరగవని వారి ఆలోచన. అయితే గోధుమ పిండిని ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకోకపోతే ఎలాంటి ప్రయోజనాలు ఉండవని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:04 PM, Thu - 23 January 25

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చాలామంది అన్నానికి బదులుగా రాగి సంగటి, జొన్న రొట్టె సద్ద రొట్టె వంటి వాటితో పాటుగా గోధుమ పిండితో చేసిన చపాతీలను ఎక్కువగా తింటూ ఉంటారు. డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం ఎక్కువ శాతం మంది గోధుమలను వారి డైట్ లో యాడ్ చేసుకుంటూ ఉంటారు. గోధుమపిండిలో ఎక్కువగానే గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలా కాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించేందుకు షుగర్ ఉన్నవారు గోధుమపిండిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అయితే ఎక్కువ శాతం మంది మార్కెట్లో దొరికే పిండిని ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే ప్రాసెస్డ్ పిండిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. శుద్ధి చేయని గోధుమల నుండి తయారైన పిండి కాకుండా హోల్ వీట్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇందులో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి షుగర్ ఉన్నవారికి బియ్యం బదులుగా తీసుకుంటే మంచిది. హోల్ గ్రెయిన్ నుంచి తయారైన గోధుమ పిండి షుగర్ ఉన్నవారికి మంచిదట. ఇది రక్త ప్రవాహంలో ఇన్సులిన్ ని తీసుకెళ్తుంది. హోల్ ఆట్టాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందట. గోధుమపిండి గ్లైసెమిక్ ఇండెక్స్ ని తగ్గించేందుకు ఎక్కువ ఫైబర్ తో కలిపి తీసుకోవడం మంచిది. దీంతో మొత్తం గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ ని తీసుకుంటే శరీరంలోని గ్లూకోజ్ జీర్ణక్రియ మందగిస్తుందట.
ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలని తగ్గిస్తుందని చెబుతున్నారు. షుగర్ ఉన్నవారు ఎక్కువగా ఫైబర్ తీసుకుంటే వారి గ్లైసెమిక్, బరువు కంట్రోల్ అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గోధుమపిండి గ్లైసెమిక్ ఇండెక్స్ ని తగ్గించేందుకు నీటితో ఉడికించాలట. లేదంటె ఆవిరితో ఉడికించాలట. నీరు,ఆవిరిపై వండిన ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుందట. ఇది రక్త ప్రవాహంలో గ్లూకోజ్ చేరడాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. గోధుమ పిండిని నీరు, పెరుగులో రాత్రంతా నానబెట్టి, ఆ తర్వాత తీసుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ విచ్ఛిన్నమై గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుందట. గోధుమ పిండిలో కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియని నెమ్మదిగా చేస్తాయి. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న కూరగాయలు పండ్లు, కూరగాయలతో తీసుకోవాలని చెబుతున్నారు. గోధుమలు, గోధుమపిండితో తయారైన ఫుడ్స్ ని ప్రోటీన్ తో కలిపి తీసుకోవాలి. పనీర్, గుడ్ల వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తో తీసుకోవడం మంచిది. అదే విధంగా వీటిని తక్కువగా తీసుకోవాలి. మంచిది కదా అని లంచ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ లో తీసుకోవడం కాదు. ఏదైనా ఒక సారి మాత్రమే తింటే మంచిదని చెబుతున్నారు.