Junk Food: జంక్ ఫుడ్ నుంచి పిల్లలను దూరం చేయడం ఎలా.? ఈ పనులు చేస్తే చాలు
ఇటీవల చిన్న పిల్లలు జంక్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. ఈ ఫుడ్ కు బానిసలుగా మారుతున్నారు. జంక్ ఫుడ్ కు అలవాటు పడి సాంప్రదాయ ఆహారం పెట్టినా తినడం లేదు.
- Author : Anshu
Date : 15-05-2023 - 8:58 IST
Published By : Hashtagu Telugu Desk
Junk Food: ఇటీవల చిన్న పిల్లలు జంక్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. ఈ ఫుడ్ కు బానిసలుగా మారుతున్నారు. జంక్ ఫుడ్ కు అలవాటు పడి సాంప్రదాయ ఆహారం పెట్టినా తినడం లేదు. సిటీలతో పాటు పట్టణాల్లో నివసించే పిల్లలు కూడా రుచికరంగా అనిపించే జంక్, మసాలా ఫుడ్ కు బాగా అలవాడి పడి మానలేకపోతున్నారు. చిన్నపిల్లలు జంక్ ఫుడ్ అయిన ఫ్రైడ్ రైస్, పిజ్జా, బర్గర్ వంటివి తింటూ అనారోగ్యాల బారిన పడుతున్నారు.
జంక్ పుడ్ తినడం వల్లన చిన్నపిల్లలకు అనేక దుష్పబావాలు వస్తాయి. చిన్న వయస్సులోనే బరువు పెరగడంతో పాటు ఊబకాయం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు చిన్న వయస్సులోనే పిల్లలు జబ్బుల బారిన పడి విలువైన చిన్ననాటి జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి సమయాల్లో చిన్నపిల్లలను జంక్ పుడ్ నుంచి దూరం చేయడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో తల్లిదండ్రులు కూడా జంక్ పుడ్ తినడం మానేయడం, పిల్లలకు ఇంట్లోనే రుచికరమైన ఆహారాలను చేసి పెట్టడం వల్ల జంక్ పుడ్‌కు దూరం చేయవచ్చని చెబుతున్నారు.
ఇక బరువు తగ్గడానికి ఇంట్లోని చిన్న చిన్న పనులను పిల్లలతో చేయించాలని, బయటకు తీసుకెళ్లేటప్పుడు నడుచుకుంటూ తీసుకెళ్లాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక అపార్ట్‌మెంట్లలో నివాసం ఉండేవారు అయితే పిల్లలను లిఫ్ట్ ద్వారా కాకుండా మెట్ల మార్గంలో తీసుకెళ్లాని చెబుతున్నారు. అలాగే శారీరక వ్యాయామం కోసం ఆటలు ఆడించడం లేదా
డ్యాన్స్ లాంటివి నేర్పించడం వల్ల బరువు తగ్గుతారని సూచిస్తున్నారు. వారికి అందించే ఫుడ్ ను తగ్గించడం, శారీరక శ్రమ కోసం ఆటలు ఆడించడం లాంటివి చేయడం ద్వారా బరువు తగ్గుతారు. ఇవన్నీ పాటిచడం ద్వారా పిల్లను జంక్ పుడ్‌కు దూరం చేసి ఆరోగ్యవంతులుగా చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.