Teeth Clean: ఎక్కువసేపు పళ్ళు తోముకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
సాధారణంగా చాలామంది దంతాలు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు రెండుసార్లు శుభ్రం చేసుకుంటూ ఉంటారు.
- By Nakshatra Published Date - 06:30 AM, Sat - 4 March 23

సాధారణంగా చాలామంది దంతాలు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు రెండుసార్లు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఉదయం లేచిన తర్వాత రెండవది రాత్రి పడుకునే ముందు. ఈ విధంగా చేయడం వల్ల పళ్ళు శుభ్రంగా ఉండడంతో పాటు నోటి దుర్వాసన కూడా రాదు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది కేవలం ఒకసారి మాత్రమే శుభ్రం చేస్తున్నారు. అయితే కొంతమంది పళ్ళు శుభ్రం చేయడం అంటే ఒక చిన్నపాటి యుద్ధమే అని చెప్పవచ్చు. ఎందుకంటే పళ్ళు తోముకునే సమయంలో ఎలా అంటే అలా ఇష్టానుసారంగా పళ్ళు శుభ్రం చేసుకోవడం వల్ల చిగుళ్ల నుంచి ఒక్కొక్కసారి రక్తస్రావం కూడా అవుతూ ఉంటుంది.
అయితే వైద్యులు ప్రతిరోజు రెండుసార్లు పళ్ళు శుభ్రం చేయడం మంచిది కాదని అలా చేయడం వల్ల దంతాలు అరిగిపోయి చిగుర్ల సమస్యలు వస్తాయని అంటున్నారు. అయితే దంతాల శుభ్రంగా ఉంచుకోవడానికి గట్టిగా బ్రష్ చేస్తూ వాటితో యుద్ధం చేయాల్సిన పనిలేదు. దంతాలు తెల్లగా, శుభ్రంగా ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది దంతాలను శుభ్రంగా ఉంచుకోవడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. మీ నోరు దుర్వాసన రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు 3 నుంచి 4 నిమిషాల పాటు బ్రష్ చేస్తే సరిపోతుంది. అలాగే దంతాల క్లీనింగ్ కోసం మృదువైన బ్రిస్టల్ బ్రష్‌ను వినియోగించాలి. అలా చేయడం వల్ల దంతాలు, చిగుళ్ళకు హాని కలుగుకుండా ఉంటుంది.
ప్రతి రోజు 2 నుంచి 4 నిమిషాలు బ్రష్ చేస్తే ప్లేక్ అనే బాక్టీరియా బయటకు వెళ్తుంది. దీంతో దంతాలు బలంగా, మెరుస్తూ కనిపిస్తాయి. చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా నోటి క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే దంతాలను క్లీన్‌గా ఉంచుకోవడానికి సరైన మొతాదులో ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్ ను మాత్రమే ఉపయోగించాలి. ఉప్పును గోరు వెచ్చని నీటిలో కలిపి పుకిలించి రోజు ఉంచితే దంతాలతో పాటు చిగుళ్లు కూడా బలంగా ఉంటాయి. అదేవిధంగా పంటి నొప్పులతో బాధపడేవారు లవంగం తింటే ఉపశమనం లభిస్తుంది.

Related News

Save Heart: రాత్రిళ్లు బ్రష్ చేయడం లేదా అయితే గుండె జబ్బులు రావడం గ్యారంటీ..
నోటిని శుభ్రంగా ఉంచుకోవడం మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యం.