Dandruff: చుండ్రు తగ్గడం కోసం కొబ్బరినూనె,నిమ్మరసం ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
చుండ్రు సమస్యల తగ్గాలి అని నిమ్మరసం కొబ్బరి నూనె అప్లై చేసేవారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలట.
- By Anshu Published Date - 12:33 PM, Thu - 7 November 24

ఇటీవల కాలంలో ఆడ మగ అని తేడా లేకుండా చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో చుండ్రు ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ చుండ్రు సమస్య కారణంగా చాలామంది రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ చుండ్రుని ను తగ్గించుకోవడం కోసం షాంపూలు హెయిర్ ఆయిల్స్ ని ఉపయోగిస్తున్నప్పటికీ, తగ్గలేదని బాధపడుతున్నారు. అయితే చాలామంది చుండ్రు సమస్యను తగ్గించుకోవడం కోసం నిమ్మరసం, కొబ్బరి నూనె కలిపి ఉపయోగిస్తూ ఉంటారు. మరి నిజంగానే ఇవి రెండూ కలిపి ఉపయోగిస్తే చుండ్రు సమస్య తగ్గుతుందా? ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చుండ్రు తగ్గించుకోవడం కోసం కొబ్బరి నూనెలో నిమ్మ రసాన్ని కలిపి జుట్టుకు అప్లై చేస్తూ ఉంటారు. అయితే ఇలా అసలు చేయకూడదని చెబుతున్నారు నిపుణులు. చుండ్రు ఉన్నప్పుడు తలకు కొబ్బరినూనె రాసుకుంటే సమస్య మరింత పెరుగుతుందట. అయితే కొబ్బరి నూనె తలకు పట్టించడం అనేది చెడ్డదేం కాదు. కానీ కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేస్తే మరింత పెరుగుతుందట. దీనివల్ల నెత్తిమీద దద్దుర్లు లేదా సెబోర్హీక్ చర్మశోథ లేదా చికాకు వంటి సమస్యలు వస్తాయట. అందుకే చుండ్రు ఉంటే వీటిని కలిపి మీ నెత్తికి ఉపయోగించకూడదని చెబుతున్నారు.
అయితే జుట్టును సరిగ్గా లేదా క్రమం తప్పకుండా షాంపూ చేయకపోవడం వల్లే చుండ్రు వస్తుందట. చుండ్రు పోవాలంటే నెత్తికి బాగా క్లీన్ చేయాలట. షాంపూను బాగా కడిగి తలస్నానం చేస్తే చుండ్రు తొలగిపోతుందట. మీ తల మీద ఏదైనా చుండ్రును క్లియర్ చేయడానికి ఇది సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ చుండ్రు సమస్య మరింత పెరిగే ఇబ్బంది పెడుతుంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు.