Sugar Cane Juice: చెరుకు రసం తాగుతున్నారా.. అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
చెరుకు రసం ఆరోగ్యానికి మంచిదే కానీ, ఈ జ్యూస్ తాగేటప్పుడు కొన్ని రకాల కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు అని చెబుతున్నారు. మరి చెరుకు రసం తాగేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:00 PM, Fri - 16 May 25

వేసవికాలంలో మనకు ఎక్కువగా లభించే జ్యూస్లలో చెరుకు రసం కూడా ఒకటి. వేసవిలో ఎక్కడ చూసినా కూడా ఈ చెరుకు రసం బండ్లు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే. చెరుకు రసం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ జ్యూస్ ని కొంతమంది మాత్రమే తాగడం మంచిది. ముఖ్యంగా డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. అయితే చెరుకు రసం తాగడం మంచిదే కానీ, ఈ జ్యూస్ తాగేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదట. మరి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఎప్పుడు మనం తెలుసుకుందాం..
మాములు చెరకు రసం తీసిన తర్వాత వెంటనే అందులో ఆక్సిడేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్‌తో రసానికి సంబంధం ఏర్పడిన వెంటనే ప్రారంభమవుతుంది. దాని ప్రభావంతో రసంలో రంగు, రుచి, పోషక విలువలు వేగంగా మారిపోయే అవకాశం ఉంటుంది. చెరకు రసం తీసిన 15 నుంచి 20 నిమిషాల్లోనే అది రంగును కోల్పోయే పరిస్థితి కలుగుతుందట. వేసవికాలంలో ఈ మార్పులు మరింత వేగంగా వస్తాయట. ఎందుకంటే చెరకు రసం సహజంగా వేడిని ఆకర్షించే లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి వేసవిలో ఒక గంట చెరకు రసం నిల్వ ఉంచితే అది చేదుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.
తాగే వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుందట. చెరకు రసంలో ఉండే సహజ ఎంజైములు, ఆక్సిజన్ ను ఎదుర్కొన్న వెంటనే తమ పని ప్రారంభిస్తాయట. అవి రసంలో రసాయనిక మార్పులను కలిగిస్తాయట. దాంతో రసం రంగు మారడం ప్రారంభమవుతుందని, ఇది పుల్లగా మారే సూచన. అంతేకాదు దీన్ని ఎక్కువసేపు నిల్వ ఉంచితే విషపూరితంగా మారే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెరకు రసం తాజాగా తీసుకోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. చెరకు రసం నిల్వ ఉంచాలనుకునే వారు ఫ్రిజ్ లో పెట్టాలని ఆలోచిస్తారు.
కానీ దీని వల్ల రసంలో తాజా తేమ కోల్పోయి, పోషక విలువలు తగ్గిపోతాయట. రుచి కూడా బాగా మారిపోతుందని, పైగా ఫ్రిజ్ లో పెట్టిన చెరకు రసం మళ్లీ రూమ్ టెంపరేచర్ కు తీసుకొచ్చిన తర్వాత త్వరగా పాడైపోతుందట. అందుకే తయారు చేసిన వెంటనే తాగడం మంచిదట. చెరకు రసం తీసిన వెంటనే తాగడం వల్ల దానిలోని ఖనిజాలు, విటమిన్లు పూర్తిగా శరీరానికి అందుతాయట. అంతేకాకుండా తక్కువ వ్యవధిలో తాగితే దాని సహజమైన రుచి చెక్కుచెదరకుండా ఉంటుందని, తక్షణ శక్తి లభిస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా చెరుకు రసం తాజాగా మీ ముందు చేసి ఇచ్చినప్పుడే తాగాలని నిల్వ ఉంచిన చెరుకు రసం అసలు తాగకూడదని చెబుతున్నారు.