Goat Milk: మేక పాల వల్ల కలిగే అద్భుతమైన లాభాలు తెలిస్తే తాగకుండా అస్సలు ఉండలేరు!
Goat Milk: మేకపాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? వాటిని తరచుగా తీసుకుంటే ఏం జరుగుతుందో శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 08:00 AM, Mon - 13 October 25

Goat Milk: మామూలుగా మనం ఎక్కువగా ఆవు పాలు లేదా గేదె పాలు తాగుతూ ఉంటాము. ఎక్కువ శాతం ఈ రెండు పాలే ఎక్కువగా మనకు మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. మేకపాలు మనకు చాలా అరుదుగా మాత్రమే లభిస్తూ ఉంటాయి. ఒకవేళ దొరికినా కూడా చాలా తక్కువ మొత్తంలో మాత్రమే లభిస్తూ ఉంటాయి. మేక పాలు మంచి రుచిని కలిగి ఉండటమే కాకుండా అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని, అంతే కాకుండా ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి.. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగపడతాయని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే మేక పాలు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయట. అలెర్జీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ మేక పాల వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. మేక పాలు ఆవు పాల కంటే చాలా త్వరగా జీర్ణం అవుతాయట. దీనిలోని తక్కువ కొవ్వు, తక్కువ ప్రోటీన్ కంటెంట్ కడుపుపై ఎక్కువ ఒత్తిడిని కలిగించవట. గ్యాస్, ఆమ్లత్వం లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఉన్న వారు వీటిని తరచుగా తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని, ఇందులో తక్కువ మొత్తంలో లాక్టోస్ కూడా ఉంటుందని చెబుతున్నారు.
ఒక గ్లాసు మేక పాలతో మీ రోజును ప్రారంభించడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగు పడుతుందట.అంతే కాకుండా మీ కడుపు కూడా తేలికగా ఉంటుందని చెబుతున్నారు. మేక పాలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి అనారోగ్యంతో పోరాడటానికి బలాన్ని ఇస్తాయట. ఈ పాలు ముఖ్యంగా జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల సమయంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయ పడతాయని, పిల్లలు, వృద్ధులు ప్రతిరోజూ కొద్ది మొత్తంలో మేక పాలు తీసుకుంటే వారు మరింత చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. మేక పాలు మీ శరీరానికి మాత్రమే కాకుండా మీ చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయట. ఇందులో విటమిన్లు A, E లు ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని తేమగా, ప్రకాశ వంతంగా ఉంచుతాయట. మీరు తరచుగా పొడి చర్మం లేదా మొటిమలను ఎదుర్కొంటుంటే ఈ పాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెబుతున్నారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయట. కాబట్టి ఒకవేళ మీకు మేకపాలు దొరికితే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తాగడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..