Winter: శీతాకాలంలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!
చలికాలంలో ఉల్లిపాయను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి, ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 02:03 PM, Sun - 22 December 24

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. ఈ సామెత నమ్మకం తరచుగా వింటూ ఉంటాం. అయితే ఈ సామెత యొక్క అర్థం ఉల్లిపాయ వల్ల అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని. ఉల్లిపాయను తరచుగా తీసుకోమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. ఉల్లిపాయలు ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొంతమంది దీనిని కూరల్లో వేసుకుని తింటే మరికొందరు పచ్చిగా కూడా తింటూ ఉంటారు. ఎలా తిన్నా కూడా ఉల్లి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలే కలుగుతాయి. ఉల్లిపాయ లేకుండా దాదాపుగా చాలా రకాల వంటలు పూర్తి కావు. అయితే ఎన్నో రకాల పోషకాలు కలిగిన ఉల్లిపాయను చలికాలంలో తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి అంటు వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. అటువంటి పరిస్థితిలో చిన్న ఉల్లిపాయలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, అంటు వ్యాధులతో పోరాడడంలో చాలా సహాయపడుతుంది. అందుకే దీన్ని పచ్చిగా తినడం వల్ల చలికాలంలో వచ్చే అంటు వ్యాధులను దూరం చేసుకోవచ్చట. చిన్న ఉల్లిపాయ ప్రకృతిలో వేడిగా ఉంటుంది. అందుకే చలికాలంలో పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. చలికాలంలో గుండెపోటు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయ పచ్చిగా తినడం మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
ఇవి శరీరంలోని అనవసరమైన కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల, శీతాకాలంలో ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు మెరుగుపడుతుందని, అధిక రక్తపోటు తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే ఉల్లిపాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మేలు చేస్తుందట. కాబట్టి చలికాలంలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి దీన్ని రోజూ తీసుకోవాలి. చలికాలంలో రోజూ ఒకటి లేదా రెండు పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఉల్లిపాయలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందని చెబుతున్నారు. ఒక చలికాలంలో మాత్రమే కాకుండా మిగతా సీజన్లలో కూడా ఉల్లిపాయను తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.