Tea in Brass: ఇత్తడి పాత్రలో టీ పెట్టుకొని తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?
పూర్వం మన పెద్దలు ఎక్కువగా మట్టి పాత్రలు, ఇత్తడి, అలాగే రాగి పాత్రలను ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ రాను రాను వీటి వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. వీటికి బదులుగా ప్రస్తుతం స్టీల్ అల్యూమినియం పాత్రలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు.
- By Anshu Published Date - 01:00 PM, Wed - 17 July 24

పూర్వం మన పెద్దలు ఎక్కువగా మట్టి పాత్రలు, ఇత్తడి, అలాగే రాగి పాత్రలను ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ రాను రాను వీటి వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. వీటికి బదులుగా ప్రస్తుతం స్టీల్ అల్యూమినియం పాత్రలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అప్పట్లో మట్టి అలాగే రాగి ఇత్తడి పాత్రలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల వాళ్లు బలంగా ఉండడంతో పాటు, వారికీ అనారోగ్య సమస్యలు కూడా వచ్చేవి కావు. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రమే ఈ స్టీల్ అల్యూమినియం పాత్రల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇకపోతే ఇలా అనారోగ్య సమస్యల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మనం ఉపయోగించే టీ పాత్ర నుంచి ఆహారం వండుకునే పాత్ర వరకు ప్రతి ఒక్క ప్రదేశంలో రాగి లేదా ఇత్తడి పాత్రను ఉపయోగించడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇత్తడి పాత్రలు ఇంకా మంచిది అంటున్నారు. అయితే మనలో చాలామందికి ప్రతిరోజు టీ తాగి అలవాటు ఉంటుంది. మరి ఈ టీని ఇత్తడి పాత్రలో చేసుకుని తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇత్తడి పాత్రలో టీ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. ఇత్తడిలో కూడా అనేక పోషకాలు ఉంటాయి. వీటి వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి.
కేవలం రాగి పాత్రలో మాత్రమే కాకుండా ఇత్తడి పాత్రలో రాత్రంతా ఉంచిన నీటిని తాగినా చాలా ప్రయోజనాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇత్తడి పాత్రలోని టీ లేదా పాలు తాగడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందట. ఇత్తడి పాత్రలు మెలనిన్ ను ఉత్పత్తి చేస్తాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయట. ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు పోయి చర్మం అందంగా మారుతుందట. అదేవిధంగా ఇత్తడి పాత్రల్లో వండిన ఆహారం తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుందట.
ముఖ్యంగా ఇందులో ఉండే జింక్ రక్తాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే ఇత్తడి పాత్రల్లో ఆహారాన్ని వండటం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు కూడా తగ్గుతాయట. కఫ, పిత్త, వాత దోషాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇత్తడి పాత్రల్లో వండటం వల్ల ఆహారం రుచి పెరుగుతుందట. ఇత్తడిలో ఉండే పోషకాలు ఆహారంలో చేరి రుచిని మరింత పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
NOTE: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.