Garlic In Milk: దంచిన వెల్లుల్లిని పాలలో ఉడికించి తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
మన వంటింట్లో ఎక్కువగా దొరికే వాటిల్లో వెల్లుల్లి కూడా ఒకటి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో ఘాటైన వాసనను కలిగి ఉన్న ఈ వెల్లుల్లిని మనం తరచుగా కూరల్లో ఉపయోగిస్తూ ఉంటాము. ఈ వెల్లుల్లిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు.
- By Anshu Published Date - 11:11 AM, Wed - 31 August 22

మన వంటింట్లో ఎక్కువగా దొరికే వాటిల్లో వెల్లుల్లి కూడా ఒకటి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో ఘాటైన వాసనను కలిగి ఉన్న ఈ వెల్లుల్లిని మనం తరచుగా కూరల్లో ఉపయోగిస్తూ ఉంటాము. ఈ వెల్లుల్లిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. ఈ వెల్లుల్లిని తెల్లగడ్డ, ఎల్లిగడ్డ, ఎల్లి పాయ ఇలా ఒక్కో ప్రదేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. అయితే ఈ వెల్లుల్లికి ఆయుర్వేదంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూనే ఉన్నారు. ఈ వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.
అలాగే ఈ వెల్లుల్లి వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా బయట పడవచ్చు.
వెల్లుల్లి యాంటీ బయోటిక్ గా కూడా పనిచేస్తుంది. వెల్లుల్లిని మధుమేహం ఉన్న. వారు తినడం వల్ల అది చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. వెల్లుల్లి చర్మ పునరుత్పత్తిని బాగా పెంచుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చి, మొటిమలు, సోరియాసిస్, తామర లాంటివి రాకుండా నిరోధిస్తుంది. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ వెల్లుల్లిని దంచి పాలలో ఉడకబెట్టుకుని తాగితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
. దంచిన వెల్లుల్లిని పాలలో ఉడకయించి తాగడం వల్ల కీళ్ల నొప్పుల సమస్యలను నివారిస్తుంది. అలాగే తల్లిపాల ఉత్పత్తి కూడా మెరుగుపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉండదు. అలాగే ఎముకలు కూడా గట్టి పడతాయి. చర్మ సమస్యలు దరిచేరవు. అలాగే రక్తం గడ్డ కట్టే లాంటి సమస్యలు కూడా ఎదురవ్వవు. అదేవిధంగా జీర్ణ సమస్యలు కూడా నివారిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి తగ్గించి, క్యాన్సర్ ను తగ్గిస్తుంది. మలబద్ధక సమస్య కూడా ఉండదు. అదేవిధంగా వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించవు.