Danger Food: ఈ ఫుడ్ కాంబినేషన్ ఎంత డేంజరో తెలుసా…?
ఆరోగ్యం మహాభాగ్యం అన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాహారం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
- By hashtagu Published Date - 09:00 AM, Fri - 3 June 22

ఆరోగ్యం మహాభాగ్యం అన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాహారం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాదు కొన్ని ఆహార కాంబినేషన్ల వంటకాలు భటే రుచిగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. చాలామంది కాంబినేషన్లు లేకపోతే తినేందుకు ఇష్టపడరు. అయితే కొన్ని కాంబినేషన్లు ఎంత రుచిగా ఉంటాయో…అంతే డేంజర్ కూడా అని తెలుసుకోవాలి. ఇలాంటి ఆహారం తినడం వల్ల వెంటనే ఎలాంటి ప్రభావం కనిపించకపోయినా…క్రమేనా విషతుల్యమయ్యే ప్రమాదం ఉంటుంది. మరి ఆ డేంజరస్ కాంబినేషన్ ఆహార పదార్థాలేమిటో తెలుసుకుందాం.
1. నిమ్మకాయ, పాలు కలిపి తీసుకోకూడదు. కడుపులో ఉండే జీర్ణ రసాల్లో నిమ్మకాయ కంటే అత్యధిక యాసిడ్ గుణాలు ఉంటాయి. పాలు, నిమ్మ కాంబినేషన్ కడుపులో విషంగా మారే ప్రమాదం ఉంటుంది.
2. పెరుగు, పండ్లు కలిపి ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు. సిట్రస్ పండ్లు పెరుగుతో కలిపి తీసుకుంటే…కడుపులో యాసిడ్స్ ఏర్పడి జీవక్రియపై ప్రభావం చూపుతాయి.
3. మజ్జిగ-అరటిపండు నల్ల మిరియాలు-చేపలు, పెరుగు-ఖర్జూరాలు, పాలు-మద్యం ఇలాంటి కాంబినేషన్‌లలో ఆహానం తినడం అంత మంచిది కాదు.
4. అరటిపండు, పాలు కలిపి తీసుకుంటే జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది. అలాగే అరటిపండుని పాలతో తీసుకుంటే జఠరాగ్ని తగ్గిపోతుంది. విషాలు ఉత్పత్తి అవుతాయని, దగ్గు, జలుబు, అలర్జీలు, సైనస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
5. టీ, పెరుగు ఒకేసారి తీసుకోకూడదు. ఈ రెండిట్లోను యాసిడ్స్ ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం సమతుల్యత కోల్పోయి ..జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతోంది.
6. కీరదోస, టమాటాలు, పెరుగు, వంటి వాటితో నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోకూడదు. కడుపులో అసిడిటీ ఎక్కువైపోయి గ్యాస్ సమస్యలు వస్తాయి.