Women Disease: స్త్రీలకు మాత్రమే వచ్చే వ్యాధి ఇది.. ట్రీట్మెంట్ కూడా లేదు..
ఎండోమెట్రియాసిస్ కు చికిత్స లేదు. గర్భనిరోధక మాత్రలే ఇస్తారు. కంట్రోల్ చేసేందుకు ఈస్ట్రోజన్ హార్మోన్ ట్యాబ్లెట్లను ఇస్తారు. ఈ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్..
- By News Desk Published Date - 08:57 PM, Thu - 28 December 23
Women Disease: ప్రపంచంలో స్త్రీ లకు మాత్రమే వచ్చే వ్యాధి ఇది. దీని ట్రీట్మెంట్ లేదు. ప్రస్తుత జనాభాలో 10 శాతం స్త్రీలు.. సుమారు 17.5 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇంతకీ ఏంటి ఆ వ్యాధి ? అదే ఎండోమెట్రియాసిస్. చాలామంది ప్రజలకు, కొందరు వైద్యులకు దీని గురించి అవగాహన లేదు. ఇంతవరకూ ఎలాంటి చికిత్స లేదు. ఈ వ్యాధితో బాధపడుతూ ప్రతినెలా పీరియడ్స్ పెయిన్ ను భరించేవారెందరో ఉన్నారు.
కొందరికి పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పిని అంత ఈజీగా తీసుకోకూడదు. అది ఎండోమెట్రియాసిస్ కావొచ్చంటున్నారు వైద్యులు. నెలసరి ఉన్నప్పుడే ఈ ఎండోమెట్రియాసిస్ లక్షణాలు కనిపిస్తాయి. ఒక్క అవయవానికే ఇది పరిమితం కాదు. ఇతర అవయవాలకూ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో తట్టుకోలేని నొప్పి వస్తే.. వెంటనే వైద్యుల్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
అమెరికాలో ప్రతి 10 మంది స్త్రీలలో ఒకరికి ఈ వ్యాధి ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ వ్యాధి ఉన్న స్త్రీలకు నెలసరి సమయాల్లో తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. ముఖ్యంగా కటి భాగంలో నొప్పి, నెలసరి క్రమరహితంగా వస్తుంది. ప్రతినెలా పీరియడ్స్ క్రమంగా రావు. రక్తస్రావం అధికంగా ఉండటం, వక్షోజాల్లో నొప్పి, యూరిన్ ఇన్ఫెక్షన్, లైంగిక క్రియలో పాల్గొనప్పుడు నొప్పి, పొత్తి కడుపులో నొప్పి రావడం వంటివన్నీ ఎండోమెట్రియాసిస్ లక్షణాలుగా చెప్పుకుంటారు.
ఎండోమెట్రియాసిస్ కు చికిత్స లేదు. గర్భనిరోధక మాత్రలే ఇస్తారు. కంట్రోల్ చేసేందుకు ఈస్ట్రోజన్ హార్మోన్ ట్యాబ్లెట్లను ఇస్తారు. ఈ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కొందరు వైద్యులు ప్రెగ్నెంట్ అవడంతో ఈ వ్యాధి తగ్గుతుందని చెబుతారు కానీ.. దానివల్ల 9 నెలలు మాత్రమే ఆ బాధ తగ్గుతుంది. మళ్లీ వ్యాధి మామూలే. అందుకే చాలామంది ఈ వ్యాధి నుంచి తప్పించుకునేందుకు గర్భసంచిని తొలగించుకుంటున్నారు. కానీ ఇది గర్భసంచికి మాత్రమే పరిమితం కాదు. ఇతర అవయవాలకూ సోకే అవకాశం ఉంది.
ఫిలోపియన్ ట్యూబ్స్, కటి భాగంలో, పెద్దపేగులు, చిన్నపేగులు, యోని.. ఇలా ఎక్కడైనా ఎండోమెట్రియాసిస్ పొర ఏర్పడితే అది వ్యాధిగా మారుతుంది. ఒక్కోసారి ఊపిరితిత్తులు, వెన్నెముకలు, మెదడు, కళ్ళలో కూడా ఇది రావొచ్చు. దీనికి సరైన చికిత్స లేదు. ఒకసారి వస్తే జీవితాంతం భరించాల్సిందే.
Related News
Female Infertility: స్త్రీలలో వంధ్యత్వానికి ప్రధాన కారణాలివే
వంధ్యత్వం (Infertility) అనేది ప్రపంచ సమస్య. వాస్తవానికి వంధ్యత్వానికి ఏ ఒక్కరూ పూర్తి బాధ్యులు కాదు. దీనికి 40% మేర పురుషులు కారణం అవుతుండగా.. 40% మేర స్త్రీలు, మిగితా 20% మేర ఇద్దరూ సమానంగా కారణం అవుతున్నారు. కాబట్టి వంధ్యత్వం అనేది ఏ ఒక్కరి వల్లో రాదని గుర్తుంచుకోవాలి.