Mushrooms: పుట్టగొడుగులు అధికంగా తింటే ఏం జరుగుతుందో తెలుసా?
పుట్టగొడుగులు.. చాలామంది వీటిని తినడానికి ఇష్టపడితే కొద్దిమంది మాత్రమే వీటిని తినడానికి ఇష్టపడరు. చాలామంది
- By Nakshatra Published Date - 06:40 PM, Thu - 13 April 23
పుట్టగొడుగులు.. చాలామంది వీటిని తినడానికి ఇష్టపడితే కొద్దిమంది మాత్రమే వీటిని తినడానికి ఇష్టపడరు. చాలామంది వీటిని తినక పోవడానికి గల కారణం కూర చేసిన తర్వాత కొంచెం జిగురుగా ఉండడం వల్లే. పుట్టగొడుగు వల్ల లాభాలు తెలిసిన వాళ్ళు మాత్రం బట్టలు వేసుకొని మరి తినేస్తూ ఉంటారు. ఈ పుట్టగొడుగులు మనకు ఎక్కువగా పల్లెటూరి ప్రాంతంలో పొలాల గట్లపై చెట్ల కింద తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇటీవల కాలంలో ఈ పుట్టగొడుగుల వినియోగం పెరిగిపోవడంతో చాలామంది చాలామంది పుట్టగొడుగుల పెంపకాన్ని కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆ పుట్టగొడుగులను పెంచుకొని లక్షల సంపాదిస్తున్నారు.
ఆ విషయం పక్కన పెడితే పుట్టగొడుగు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మన అందరికి తెలిసిందే. మరి పుట్టగొడుగులు ఎక్కువగా తినడం తినడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుట్ట గొడుగుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.. ఇందులో పొటాషియం, కాపర్, సెలీనియం, ఐరన్, విటమిన్ డి ,బి అధికంగా లభిస్తాయి. వీటిని ఆహారంలో నిత్యం తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు. కానీ పుట్టగొడుగులను మితిమీరి తింటే మాత్రం డేంజరే అని అంటున్నారు నిపుణులు.
ఈ పుట్టగొడుగులను అధికంగా తినడం వలన ఆరోగ్య సమస్యలతో పాటు తలనొప్పి కూడా వస్తుంది. కాబట్టి వీటిని అధికంగా తీసుకోకుండా పరిమితిలో మాత్రమే తీసుకోవాలి. అలాగే వీటిని అధికంగా తినడం వలన అలసట, నీరసం, గుండెకి సంబంధించిన లాంటి సమస్యలు వస్తాయి. అలాగే జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా తలెత్తుతాయి. ఈ పుట్టగొడుగులను ఎక్కువగా తినడం వల్ల చర్మానికి సంబంధించిన అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అలర్జీలు ఎక్కువ అవుతూ ఉంటాయి. పుట్టగొడుగులు ఎక్కువగా తీసుకోవడం వలన విరోచనాలు, వికారం, కడుపునొప్పి, వాంతులు కూడా అవుతాయి.
Related News
Food Tips : టీ నుండి అన్నం వరకు.. మీరు మళ్లీ వేడి చేయకూడని 5 ఆహార పదార్థాలు..!
జీవితపు బిజీ ఎంతగా పెరిగిపోయిందంటే, మన ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కూడా సమయం దొరకడం లేదు. బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్, బటర్, మ్యాగీ, శాండ్విచ్ మొదలైన రెడీమేడ్ ఫుడ్స్ తినడం ద్వారా రోజును ప్రారంభిస్తున్నాం.