Betel Basil Seeds: తమలపాకు తులసి గింజలను కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
- Author : Sailaja Reddy
Date : 28-03-2024 - 7:47 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా చాలామంది ఈ తమలపాకు తినే అలవాటు ఉంటుంది. ఈ తమలపాకుని పాన్ బీడా, పాన్, ఇంకా కొన్ని కొన్ని పదార్థాల ద్వారా తమలపాకులు తీసుకుంటూ ఉంటారు. తమలపాకును తినడానికి ఇష్టపడేవారు తమలపాకు, జర్దా, సున్నం కలిపి తింటే ఆరోగ్యానికి చాలా హానికరం. అయితే ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్టుగానే తమలపాకు తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకు లోని ఆస్ట్రింజెంట్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. తమలపాకులు, తులసి గింజలను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. తమలపాకులు, తులసి గింజలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇది అనేక విధాలుగా ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడుతుంది. తమలపాకులు, తులసి గింజలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక రకాల బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వాతావరణంలో మార్పు కారణంగా శరీరంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలలో జలుబు, దగ్గు కూడా ఒకటి. జలుబు అనేది ఒక సాధారణ అనారోగ్య సమస్య. కానీ కరోనా వైరస్ తర్వాత ఈ వ్యాధి సాధారణమైనది కాదు. అటువంటి పరిస్థితిలో తమలపాకులు, తులసి గింజలతో కలిపి తింటే చక్కటి ఫలితం ఉంటుంది. ఇది జలుబు, దగ్గు సమస్యను దూరం చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, దృఢత్వం నుండి ఉపశమనం లభిస్తుంది.
ఈ తమలపాకుపాటు తులసి గింజలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. దీంతో పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి గింజలను తమలపాకులతో కలిపి తీసుకుంటే మలబద్ధకం, గ్యాస్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. తమలపాకులు, తులసి గింజలు కలిపి తీసుకోవటం వల్ల చిగుళ్ల వాపు, దంతాల పసుపు నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చిగుళ్లలో వాపు, గడ్డలు, రక్తస్రావం నుండి ఉపశమనం కలిగిస్తాయి. చాలా సార్లు నోటి నుండి దుర్వాసన సమస్య ఉంటుంది.
ఈ దుర్వాసన చాలాసార్లు బ్రష్ చేసినా, కడిగినా పోదు. అయితే తమలపాకులో తులసి గింజలు వేసి క్రమం తప్పకుండా తీసుకుంటే నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనితో పాటు అనేక నోటి సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇందుకోసం ప్రతిరోజూ తులసి గింజలతో పాటు తమలపాకులను నమలి తినాలి. లేదంటే తులసి గింజలు, తమలపాకులను నీటిలో నానబెట్టాలి. ఈ రెండింటినీ కనీసం రెండు మూడు గంటలు నీటిలో నానబెట్టండి. రెండు- మూడు గంటల తర్వాత ఈ నీటిని తాగేయండి. తరచుగా ఇలా చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.