Aloe Vera Juice: ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?
ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
- Author : Anshu
Date : 06-09-2024 - 3:08 IST
Published By : Hashtagu Telugu Desk
కలబంద వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కలబందను కేవలం అందానికి మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలకు కూడా వినియోగిస్తూ ఉంటారు. కొంతమంది పరగడుపున కలబందను తింటూ ఉంటారు. మరి కొంతమంది కలబంద చేదుగా ఉన్నా సరే జ్యూస్ చేసుకుని మరి తాగుతూ ఉంటారు. మరి కలబంద జ్యూస్ ను ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుఅవ్వడంతో పాటు గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలుతగ్గించడానికి సహాయపడుతుంది.
అలాగే అలోవెరా జ్యూస్ లో తక్కువ కేలరీలు ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అలోవెరా లో ఉండే విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు, జ్వరాలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే అలోవెరాలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుండి రక్షిస్తాయి. అలోవెరా జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే, ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు. షుగర్ బాధితులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగితే మంచిదని చెబుతున్నారు.
కలబంద లో సహజంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడమేకాక మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అలోవెరా లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి, మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో కలబంద రసం తాగితే చర్మాన్ని మృదువుగా తాజాగా చేయడంతోపాటు మెరుపునూ అందిస్తుంది. కురులను బలంగా మారుస్తుంది. మృదుత్వాన్నీ ఇస్తుంది. ప్రతి రోజూ పరగడపుడన కలబంద రసం తాగితే కురులు ఒత్తుగా పెరుగుతాయి. కాగా కొంతమందికి అలోవెరా జ్యూస్ కడుపులో మంట, అతిసారం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. గర్భవతులు, పాలిచ్చే తల్లులు అలోవెరా జ్యూస్ తాగే ముందు వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు.
note: పైన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.