Mango Seed: మామిడి పండు తిన్న తర్వాత టెంక పడేస్తున్నారా.. కానీ ఇక మీదట అలా అస్సలు చేయకండి.. ఎందుకంటే?
మామిడి పండు తిన్న తర్వాత టెంక అస్సలు పడేయకూడదని, మామిడి టెంక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:32 AM, Fri - 23 May 25

వేసవికాలం వచ్చింది అంటే చాలు అందరికి ఇష్టమైన మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీ ఒక్కరు మామిడి పండ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. కాగా మామిడి పండ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మామిడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇకపోతే మామిడి తిన్న తర్వాత దాని టెంక పడేయడం అన్నది సహజం. మాములుగా ఇది ప్రతీ ఒక్కరు చేసే పని. కానీ ఇక మీదట అలా అస్సలు చేయకండి అంటున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడి టెంక రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుందట.
ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుందట. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుందని,రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే మామిడి గింజల్లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయట. ఇది శరీరం సంక్రమణతో పోరాడటానికి సహాయపడుతుందని చెబుతున్నారు. కాలేయ ఆరోగ్యానికి మామిడి టెంకలో కాలేయాన్ని నిర్విషీకరణ చేసే లక్షణాలు ఉంటాయట. ఇవి శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయట. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. కాగా మామిడి టెంకలో కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయని, ఇవి బలమైన ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి చాలా అవసరం అని చెబుతున్నారు.
మామిడి గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయట. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయని, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే జీర్ణక్రియకు మామిడి విత్తనాల పొడి ఆరోగ్యకరమైన గట్ ను నిర్వహణకు తోడ్పడుతుందట. విరేచనాలు, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా మామిడి టెంక నుంచి వచ్చే ఆయిల్ చర్మానికి మేలు చేసే గొప్ప మాయిశ్చరైజర్ లా పనిచేస్తుందట. దీని ని పొడిని ఫేస్ ప్యాక్ లో వేసుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఇందుకోసం మామిడి గింజలు లేదా టెంకలను బాగా ఎండబెట్టాలి. తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని స్మూతీలు లేదా జ్యూస్ లలో కలిపి తాగుతూ ఉండాలి. ఈ పొడిని టీలో వేసుకుని తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అని నిపుణులు చెబుతున్నారు.