Health Tips: వాము వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా? ఒకసారి తెలుసుకుంటే ఇక వదిలిపెట్టరు.
కూరల్లో మనం వాడే పప్పు దినుసులతో పాటు వాము, జీరకర్ర లాంటి వాటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
- By Nakshatra Published Date - 07:56 PM, Fri - 31 March 23
Health Tips: కూరల్లో మనం వాడే పప్పు దినుసులతో పాటు వాము, జీరకర్ర లాంటి వాటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటల్లో వాముకు ఎంతో ప్రత్యేక ఉంది. చాలా కర్రీలలో దీనిని ఉపయోగిస్తారు. వాము వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే కూరల్లో దీనిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే వాము వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకలిని తగ్గించడానికి, కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడానికి వాము చాలా ఉపయోగపడుతుంది. వాముని కషాయం లాగా చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో లాభం జరుగుతుంది. వాము గింజల్లో ఎంజైమ్లు ఉంటాయి. ఇవి కడుపులో జీర్ణక్రియను మరింత మెరుగ్గా చేస్తాయి. ఇక కడుపునొప్పికి మంచి వంటింటి చిట్కా వామునే. వామును కషాయం లాగా చేసుకుని తాగితే అజీర్ణం తొలగిపోతుంది. అలాగే వాము విత్తనాలు కడుపు పుండు, పేగు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తాయి.
అంతేకాకుండా చిన్నపిల్లలకు కూడా కడుపునొప్పి వచ్చినప్పుడు వాముతో కూడిన వాటర్ ను తాగిస్తే నొప్పి తగ్గిపోతుంది. 100 గ్రాముల వాముని ఒక లీటర్ నీటితో మరిగించాలి. సగానికి తగ్గిన తర్వాత తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది. అలాగే మిరియాలతో పాటు 35 గ్రాముల వాముని గ్రౌండ్ చేయాలి. అందులో 35 గ్రాముల తాటి బెల్లం వేయాలి. 5 గ్రాముల చొప్పున దీనికి ఉదయం, సాయంత్రం తింటే అజీర్తి, కడుపులోని సమస్యలు తొలగిపోతాయి.
అలాగే వాము నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు వంటివి తగ్గుతాయి. ఇక వాము వాటర్ వల్ల నడుము నొప్పి, శరీర బరువు కూడా తగ్గుతాయి. కొవ్వును వాము పూర్తిగా కరిగిస్తుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. అంతేకాకుండా వాము వాటర్ తాగడం వల్ల అలసట, నీరసం వంటివి తగ్గుతాయి. వామును మెత్తగా చేసి మజ్జిగలో కలుపుకుని తాగితే నీరసం పోతుంది.
Related News
Vamu : బరువు తగ్గాలనుకున్నవారు వామును ఇలా తీసుకుంటే చాలు నెలలోనే 20 కేజీలు తగ్గడం ఖాయం?
మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో వాము తప్పనిసరిగా ఉంటుంది. ఈ వామును ఎన్నో రకాల ఆహార పదార్థాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వాముని కొన్ని ప్రదేశాలలో