HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Health News
  • ⁄Do Not Cook In Aluminum Pans

Kichen Tips :అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా..?కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!!

పూర్వం వంటకోసం మట్టిపాత్రలనే ఉపయోగించేవారు. కానీ ఇఫ్పుడు ట్రెండ్ మారింది. స్టీల్, ఇత్తడి,కాపర్, అల్యూమినియం, నాన్ స్టిక్ వేర్ వంటి రకరకాల వంటపాత్రలు అందుబాటులోకి వచ్చాయి.

  • By Bhoomi Published Date - 04:07 PM, Fri - 2 September 22
Kichen Tips :అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా..?కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!!

పూర్వం వంటకోసం మట్టిపాత్రలనే ఉపయోగించేవారు. కానీ ఇఫ్పుడు ట్రెండ్ మారింది. స్టీల్, ఇత్తడి,కాపర్, అల్యూమినియం, నాన్ స్టిక్ వేర్ వంటి రకరకాల వంటపాత్రలు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటిలో ఎక్కువ శాతంమంది కిచెన్ లో కనిపించేవి మాత్రం అల్యూమినియం పాత్రలే. కూర, చారు, అన్నం చివరికి చాయ్ కాయడానికి కూడా మన కిచెన్ లో అల్యూమినయం పాత్రలు ఉండాల్సిందే. మరి ఈ పాత్రలు ఎంతవరకు సురక్షితం. అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో మొదలైది. వంటచేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవల్సిన అంశం ఒకటుంది. టొమాటో లాంటి యాసిడ్స్ కలిగిన పదార్థాలు, పుల్లని పదార్థాలు వండటం కోసం అల్యూమినియం పాత్రలను వాడినప్పుడు వీటినుంచి ఎక్కువ శాతం అల్యూమినియం పదార్థాల్లో కలిసే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అల్యూమినియం పాత్రల్లో ఈ పదార్థాలు వండకూడదు:
టమాటో గ్రేవీ :
అందరికీ తెలిసినట్లుగా, టమోటాలో ఆమ్ల గుణాలు ఉంటాయి. టొమాటోలను అల్యూమినియంలో ఎక్కువసేపు ఉడికించడం వల్ల వాటి రుచి మారుతుంది. టమోటాలు పుల్లగా ఉన్నందున, అవి అల్యూమినియంతో కలిసిపోతాయి. అల్యూమినియం మూలకాలు టమోటా గ్రేవీ ద్వారా మన కడుపులో చేరుతాయి.

వెనిగర్ సంబంధిత వంటకాలు:
కుకిలస్ట్రేటెడ్ దీనిపై పరిశోధన చేసింది. దీని ప్రకారం, వెనిగర్ అల్యూమినియంతో చర్య జరుపుతుంది. వెనిగర్ ఉన్న ఏదైనా ఆహారాన్ని అల్యూమినియం కంటైనర్‌లో వండకూడదు. ఊరగాయలను కూడా అల్యూమినియం డబ్బాల్లో ఎప్పుడూ ఉంచకూడదు. సాల్టెడ్ గింజలకు గాజు కంటైనర్ మంచిది.

లెమన్ ఫ్రూట్ ఫుడ్ (లెమన్ రైస్):
లెమన్ ఫ్రూట్ నుండి లెమన్ రైస్‌తో సహా లెమన్ ఫ్రూట్ ఉపయోగించి ఎలాంటి ఫుడ్ అయినా అల్యూమినియం కంటైనర్‌లో తయారు చేయకూడదు. సిట్రస్ ఆహారాలు పుల్లగా ఉంటాయి. అవి అల్యూమినియంతో ప్రతిస్పందిస్తాయి. దీని వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకరం కాదని పరిశోధనలు చెబుతున్నప్పటికీ, వీటికోసం ఉపయోగించడం అంతమంచిది కాదు.

అల్యూమినియంను ఇలా వాడాలి:
అల్యూమినియం పాత్రల వాడకం ఇప్పుడు అనివార్యమైంది. కాబట్టి దాని ఉపయోగం నివారించలేము. కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అల్యూమినియం పాత్రల్లో ఏ ఆహారాన్ని వండినా అందులో ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచవద్దు. ఆహారాన్ని మరొక కంటైనర్‌కు బదిలీ చేయాలి. అలాగే పాత అల్యూమినియం పాత్రల వాడకాన్ని తగ్గించండి. మైక్రోవేవ్‌లో అల్యూమినియం పాత్రలు పెట్టకూడదు. అలాగే, నికెల్ పూత పూసిన పాత్రలను ఉపయోగించే ముందు జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి నికెల్‌కి అలెర్జీని కలిగిస్తుంది.

అల్యూమినియం పాత్రలతో అనారోగ్య సమస్యలు:
అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం వల్ల బ్రెయిన్ సెల్స్ డామేజ్ అయ్యే ప్రమాదం ఉందని పరిశోధనల్లో తేలింది. ఈ పాత్రలను ఎక్కువ కాలం వాడినట్లయితే షుగర్, కీళ్ళ నొప్పులు, లివర్ వ్యాధులు, కిడ్ని సమస్యలు, గుండె సమస్యలు కూడా వస్తాయని పరిశోధనల్లో తేలింది. అయితే అల్యూమినియం పాత్రల్లో వంటకాలు చేయెచ్చు కానీ ప్యూర్ అల్యూమినియం కాకుండా ఎనోడైజ్డ్ అల్యూమినియం మెటల్‌తో తయారు చేసిన పాత్రల్లో వంటకాలు వండితే అది వంటల్లో కలిసే ప్రమాదం అంతగా ఉండదని పరిశోధకులు అంటున్నారు.

Tags  

  • aluminiumpans
  • cook
  • dishes

Related News

Kitchen Vastu: కిచెన్ లో గ్యాస్ స్టౌ, గిన్నెలు తోమే సింక్ పక్క పక్కనే ఉండవచ్చా…ఉంటే ఏం చేయాలి…!!

Kitchen Vastu: కిచెన్ లో గ్యాస్ స్టౌ, గిన్నెలు తోమే సింక్ పక్క పక్కనే ఉండవచ్చా…ఉంటే ఏం చేయాలి…!!

వాస్తు శాస్త్రంలో, వంటగది దిశకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏదైనా ఇంటి ఆగ్నేయ మూలలో వంటగదికి అత్యంత అనుకూలమైన దిశగా పరిగణిస్తారు

  • Clay Pots : మట్టి పాత్రల్లో వంట చేయాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!!

    Clay Pots : మట్టి పాత్రల్లో వంట చేయాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!!

  • Sesame Oil : నువ్వుల నూనె వంటకాలు మగవాళ్లు తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…!!

    Sesame Oil : నువ్వుల నూనె వంటకాలు మగవాళ్లు తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…!!

  • Menu For Modi: మోడీకి ‘తెలంగాణ’ రుచులు!

    Menu For Modi: మోడీకి ‘తెలంగాణ’ రుచులు!

Latest News

  • NBK- PSPK: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై బాలయ్య ప్రశ్న.. ప్రోమో వైరల్!

  • Kiwis T20: కివీస్‌దే తొలి టీ ట్వంటీ

  • China: భవిష్యత్తులో చైనాతో ఘర్షణలు.. షాకిస్తున్న నివేదిక!

  • Rajinikanth: రోజూ మద్యం తాగే రజినీకాంత్.. ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి!

  • Tarakaratna: తారకరత్న శరీరం రంగు నీలి రంగులోకి ఎందుకు మారిందంటే?

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: