News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Health News
  • ⁄Ccmb Discovers How Corona Virus Infects

Corona Virus : కరోనా వైరస్ ఎలా సోకుతుందో కనిపెట్టిన సీసీఎంబీ.. తేనెటీగల విషమే విరుగుడా?

కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ హెచ్చుతగ్గుల వల్ల ప్రజల్లో ఆందోళన ఇంకా పెరుగుతోంది.

  • By Hashtag U Published Date - 10:52 AM, Wed - 4 May 22
Corona Virus : కరోనా వైరస్ ఎలా సోకుతుందో కనిపెట్టిన సీసీఎంబీ.. తేనెటీగల విషమే విరుగుడా?

కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ హెచ్చుతగ్గుల వల్ల ప్రజల్లో ఆందోళన ఇంకా పెరుగుతోంది. అసలు ఈ వైరస్ ఎలా సోకుతుందో అని కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది శాస్త్రవేత్తలు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్ని పరిశోధనలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రంగంలోకి దిగిన సీసీఎంబీ, చండీగఢ్ లోని ఐఎంటెక్ లు మరింత లోతుగా పరిశోధన చేశాయి.

ఈ రెండు సంస్థలు కొన్ని ఆసుపత్రులతో కలిసి పరిశోధన చేశాయి. గాలిలోని కరోనా వైరస్ కణాలు మనుషులకు సోకుతాయని వీరి పరిశోధనలో తేలింది. అంటే గాలి ద్వారానే వైరస్ ఎక్కువగా సోకుతోందని నిర్థారణకు వచ్చారు. హైదరాబాద్, మొహలీలలో కొవిడ్ రోగులు ఉన్న ఆసుపత్రులతోపాటు కరోనా వైరస్ సోకిన రోగులు ట్రీట్ మెంట్ తీసుకుంటున్న మూసి ఉంచిన గదులు, ఇంట్లో చికిత్స తీసుకుంటున్న వారి
గృహ సముదాయాల్లో గాలి నమూనాలను సేకరించారు. వీటిలో కరోనా వైరస్ జన్యుపదార్థాలను పరిశీలించారు.

కొవిడ్ రోగులు ఉన్న ప్రాంతంలోని గాలిలో వైరస్ ఎక్కువగా ఉంటుంది. రోగులు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రాంతంలో పాజిటివిటీ రేటు కూడా భారీగా పెరుగుతుంది. ఐసీయూతోపాటు ఇతర వార్డుల్లోనూ వైరస్ ఆనవాళ్లు లభించాయి. రోగికి ఎంత ఇన్ ఫెక్షన్ ఉంది అన్నదానితో సంబంధం లేకుండా వైరస్ ను వ్యాప్తి చేస్తారు. గాలిలో వైరస్ ఎక్కువ దూరం వ్యాపిస్తుందని వీరి పరిశోధనలో తేలింది. ఏరో సోల్ సైన్స్ జర్నల్ లో ఈ పరిశోధన ఫలితాలను ప్రచురించారు. ఒక గదిలో ఒక కొవిడ్ రోగి ఉంటే 15.8 శాతం, ఇద్దరు లేగా అంతకన్నా ఎక్కువమంది ఉంటే 75 శాతంగా పాజిటివిటీ రేటు ఉందని వీరి పరిశోధనలో తేలింది.

తేనెటీగలు కుట్టేటప్పుడు అది విసర్జించే పదార్థంలో ఎంజైమ్‌లు, మినరల్స్‌, షుగర్‌, అమైనో యాసిడ్‌లు ఉంటాయి. వీటిలో అమైనో యాసిడ్‌లో పెప్టైడ్స్ పై సీసీఎంబీ పరిశోధన చేసింది. దీంతో కొవిడ్ ట్రీట్ మెంట్ కు ఉపయోగించే యాంటీ బ్యాక్టీరిల్ పెప్టైడ్స్ తేనెటీగల విషంలో ఉన్నట్టు సీసీఎంబీ గుర్తించింది. వీటిని ల్యాబ్ లోని వైరస్ పై ప్రయోగించింది. దీంతో ఇది వైరస్ లోడును అనూహ్యంగా 12 నుంచి 24 గంటల వ్యవధిలోనే తగ్గించింది.

Tags  

  • antidote
  • corona virus
  • covid care

Related News

Corona Virus in AP : ‘కోవిడ్ ఫ్రీ’ స్టేట‌స్ కు ద‌గ్గ‌ర‌లో  ఏపీ

Corona Virus in AP : ‘కోవిడ్ ఫ్రీ’ స్టేట‌స్ కు ద‌గ్గ‌ర‌లో ఏపీ

గ‌త రెండేళ్లుగా కోవిడ్ కేసుల‌తో అల్లాడిన ఏపీ తొలిసారిగా ఒక్క కేసు కూడా లేని రాష్ట్రంగా రికార్డ్ ల్లోకి ఎక్కింది.మొదటిసారిగా, ఏప్రిల్ 25, సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో COVID-19 యొక్క తాజా కేసులేవీ న‌మోదు కాలేదు

  • Corona Virus: ఇండియాలో మ‌ళ్ళీ పెరుగుతున్న‌ క‌రోనా కేసులు..!

    Corona Virus: ఇండియాలో మ‌ళ్ళీ పెరుగుతున్న‌ క‌రోనా కేసులు..!

  • Corona Virus: ఇండియాలో క‌రోనా.. లేటెస్ట్ అప్‌డేట్..!

    Corona Virus: ఇండియాలో క‌రోనా.. లేటెస్ట్ అప్‌డేట్..!

  • Corona Virus: ఇండియాలో క‌రోనా.. రెండేళ్ల తర్వాత వెయ్యి లోపు కొత్త‌ కేసులు..!

    Corona Virus: ఇండియాలో క‌రోనా.. రెండేళ్ల తర్వాత వెయ్యి లోపు కొత్త‌ కేసులు..!

  • Corona Virus: భ‌య‌పెడుతున్న ఎక్స్‌ఈ వేరియంట్..!

    Corona Virus: భ‌య‌పెడుతున్న ఎక్స్‌ఈ వేరియంట్..!

Latest News

  • Deepika Padukone:15 ఏళ్ల క్రితం నన్నెవరూ నమ్మలేదు.. దీపికా ఎమోషనల్!

  • Whats App : వాట్సాప్ గ్రూప్స్ లో మరో రెండు కొత్త ఫీచర్లు

  • Kinnera Moguliah : `ప‌ద్మ‌శ్రీ` వాప‌స్ కు కిన్నెర మొగుల‌య్య `సై`

  • Solar Power : రాత్రి వేళ `సోలార్ ప‌వ‌ర్` ఉత్ప‌త్తి

  • Nallala Odelu: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి నల్లాల ఓదెలు!

Trending

    • Solar Pole: సూర్యుడి ధృవపు మిస్టరీ గుట్టురట్టు.. ఫోటోలు,వీడియోలు పంపిన సోలార్ ఆర్బిటర్

    • Crocodile Attack: రాజస్థాన్ లో షాకింగ్ ఘటన…నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి మొసలి దాడి..!

    • Swami Nithyananda: నిత్యానందకు ఏమైంది? నిర్వికల్ప సమాధి అంటే ఏంటి?

    • Youngest Organ Donor: ఆరేళ్ల బాలిక అవయవదానం..ఎయిమ్స్ హిస్టరీలోనే తొలిసారి…అసలేం జరిగింది..!!

    • Viral Video : ఒకే బ్లాక్ బోర్డుపై..ఏక కాలంలో హిందీ, ఉర్దూ క్లాస్ లు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: