Horse Gram : ఉలవలు వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
ఉలవలు(Ulavalu) ఎక్కువగా పాతకాలంలో తినేవారు. వాటితో ఉలవ చారు(Ulava Charu), గుగ్గిళ్ళు, కారం పొడి చేసుకొని తినేవారు.
- Author : News Desk
Date : 03-06-2023 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఉలవలు(Ulavalu) ఎక్కువగా పాతకాలంలో తినేవారు. వాటితో ఉలవ చారు(Ulava Charu), గుగ్గిళ్ళు, కారం పొడి చేసుకొని తినేవారు. ఇప్పుడు కొంతమంది పెళ్లి భోజనాలలో ఉలవచారు పెడుతున్నారు. ఉలవలు మనం ఆహారంగా తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే ఉలవల(Horse Gram)కు వేడి చేసే గుణం ఉంది కాబట్టి వీటిని తినేవారు మితంగా తినాలి అప్పుడే మన ఆరోగ్యానికి మంచిది.
* ఉలవచారు తాగడం వలన వాతం వలన వచ్చే నొప్పులు తగ్గుముఖం పడతాయి.
* ఉలవలు మెత్తగా రుబ్బి వాటిని ఒక కాటన్ క్లోత్ లో వేసి పిండగా వచ్చిన పాలను తీసుకొని బాలింతలు తాగితే వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది.
* ఉలవలను ఆహారంగా తీసుకోవడం వలన మనలోని నిస్సత్తువపోయి ఉత్సాహం కలుగుతుంది.
* ఉలవచారు ను వేడివేడిగా తాగడం వలన దగ్గు, కఫము, జలుబు వంటి సమస్యలు తొందరగా తగ్గుతాయి.
* ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన స్త్రీలలో గర్భాశయ సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి.
* మూత్రపిండాలలో రాళ్లు ఉంటే ఉలవలు ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన అవి తగ్గుతాయి.
* అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి కూడా ఉలవలు ఉపయోగపడతాయి.
* ఉలవలు ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన మహిళల్లో నెలసరి సమస్యలు తగ్గుతాయి.
* విరోచనాలు అయినప్పుడు ఉలవచారు తాగితే అవి తగ్గుముఖం పడతాయి.
* ఉలవలు తినడం వలన మన శరీరం బలంగా తయారవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఉలవలు ఆహారంలో భాగం చేసుకోండి. లేదా ఉలవచారు అయినా అన్నంలో కలుపుకొని తినండి. మంచి రుచితో పాటు ఆరోగ్యం కూడా ఇస్తుంది.