Health Benefits: గర్భవతులు జీడిపప్పు తింటే ఏం జరుగుతుంది? లాభాలేంటి? నష్టాలేంటి?
సాధారణంగా గర్భవతులు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు. అదేవిధంగా వదులు
- Author : Anshu
Date : 25-08-2022 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా గర్భవతులు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు. అదేవిధంగా వదులు తీసుకునే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు వ్యవహరించమని చెబుతుఉంటారు. అయితే గర్భవతి మహిళలు తినవలసిన ఆహారంలో జీడిపప్పు కూడా ఒకటి. సాధారణంగా గర్భిణీ స్త్రీలు రోజుకు 300 గ్రాముల వరకు వివిధ రకాల నట్స్ ని తీసుకోవచ్చట. 300 గ్రాముల నట్స్ 15 జీడిపప్పులతో సమానం. అయితే దీనిని డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం మంచిది. జీడిపప్పులు జింక్ పుష్కలంగా లభిస్తుంది. ఇది కడుపులోని బిడ్డ కణాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది.
అంతే కాకుండా జీడిపప్పులు జింకుతో పాటు లభించే కాల్షియం వల్ల బిడ్డ పుట్టిన తర్వాత దంతాలు గట్టిగా మారుతాయి. అదేవిధంగా జీడిపప్పులో లభించే పోలిక్ యాసిడ్ వల్ల ప్రసవ సమయంలో వెన్నెముక చీలడం వంటి సమస్యలు రావు. జీడిపప్పులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి రక్త హీనత దరిచేరదు. మహిళలు తక్కువ బరువుతో ఉంటే జీడిపప్పు ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా ఇందులో లభించే కేలరీలో కొవ్వు పదార్థాలు బరువు పెరగడానికి మరింత ఉపయోగపడతాయి.
అలాగే ఇందులో ఉండే విటమిన్ కె వల్ల గర్భిణీ శరీరంలో రక్తం గడ్డ కట్టెతత్వం పెరుగుతుంది. ఇందువల్ల సిజేరియన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది ఒక వరంలో ఉపయోగపడుతుంది. జీడిపప్పులో ఉండే ఫైబర్ కారణంగా గర్భిణీ స్త్రీలలో సాధారణంగా ఉండే మలబద్ధకం సమస్య నుంచి బయటపడటంతో పాటు కడుపులోని బిడ్డ ఎలర్జీల బారిన పడకుండా కాపాడుతుంది. మిగతా డ్రై ఫ్రూట్స్ తో పాటుగా జీడిపప్పును కూడా తీసుకోవచ్చు. అయితే జీడిపప్పు పడని వారికి ఎలర్జీ రావచ్చు. అలాగే బీపీ పెరగవచ్చు జీడిపప్పు తినడంతో బరువు పెరగడం ఒక సమస్య కావచ్చు.