Infections: ఇన్ఫెక్షన్ల తో బాధపడుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలోకండి
బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్ లేదా మాస్క్ వంటివి ధరిస్తుండాలి.
- By Balu J Published Date - 04:46 PM, Sat - 21 October 23
Infections: ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్లనే ఇన్ఫెక్షన్ల కేసులుపెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి సీజనల్‌గా వచ్చే ఫ్లూ జ్వరాలు, ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు శరీరాన్ని సిద్ధం చేయాలి. దానికోసం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకుంటుండాలి. జంక్ ఫుడ్ మానేయాలి. ఇమ్యూనిటీ పెరిగేందుకు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి.
ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలతో పాటు ప్రొటీన్స్ కోసం పప్పు ధ్యాన్యాలు, ఫైబర్ కోసం మిల్లెట్స్, బ్రౌన్ రైస్, గోధుమల వంటవి తీసుకుంటుండాలి. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా కనీసం వారానికి150 నిమిషాల వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. అంటే రోజుకి 20 నిముషాల పాటైనా తేలికపాటి వ్యాయామం చేస్తుండాలి. ఇకపోతే తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా రోగనిరోధక వ్యవస్ధ క్షీణిస్తుంది. కాబట్టి రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్రపోయేలా చూసుకోవాలి.
వీటితోపాటు పిల్లలకు ప్రతి ఏడాది వేయించాల్సిన టీకాలు క్రమం తప్పకుండా వేయిస్తుండాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. శ్వాసకోస ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు ముఖాన్ని చేతులతో తాకే అలవాటు మానుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్ లేదా మాస్క్ వంటివి ధరిస్తుండాలి. జ్వరం వచ్చినప్పుడు వెంటనే రక్తపరిక్ష చేయించుకుని అది ఏ రకమైన జ్వరమో నిర్ధారించుకోవాలి. ఇష్టానుసారంగా సొంత వైద్యానికి పోవద్దు.
Related News
Fact Check: కొత్త ఏసీ కంటే పాత కూలర్ కే ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుందా.. నిజమెంత!
Fact Check: వేసవి కాలం వచ్చేసింది. ప్రజలు తమ ఇళ్లలో పక్కన పెట్టేసిన ఏసీలను స్విచ్ ఆన్ చేశారు. ఎందుకంటే అవి లేకుండా వేసవిలో ఒక్కరోజు కూడా గడపడం చాలా కష్టం. ప్రజలు తమ బడ్జెట్‌కు అనుగుణంగా AC, కూలర్లను ఎంచుకుంటారు. AC ఖరీదైనది. విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా విద్యుత్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. అందుకే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కూలర్లను వాడేందుకు ఇష్టపడుత�