HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Health
  • >7 Warning Signs And Symptoms Of Dying Liver That Should Not Be Ignored

Liver Damage Warnings: లివర్ డ్యామేజ్ డేంజరస్.. బయటపడే లక్షణాలు ఇవే!!

లివర్ అనేది శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది ఆరోగ్యంగా ఉండకపోతే ఆ ఎఫెక్ట్ మిగతా భాగాలపై పడుతుంది.

  • By Hashtag U Published Date - 08:30 AM, Sat - 24 September 22
  • daily-hunt
Liver Imresizer
Liver Imresizer

లివర్ అనేది శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది ఆరోగ్యంగా ఉండకపోతే ఆ ఎఫెక్ట్ మిగతా భాగాలపై పడుతుంది. కాబట్టి లివర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఏదో ఓ సమస్య వస్తుంది. లివర్‌కి సమస్య వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* అలసిపోవడం 

పని చేసినా లేక చేయక పోయినా కొంత సమయానికి నీరసంగా మరియు అలసటగా ఉండడం.

* బరువు తగ్గిపోవడం

ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం. నిజానికి ఎందుకు బరువు తగ్గామో తెలియదు. లివర్‌కు సంబంధించిన వ్యాధి వచ్చినప్పుడు చాలా శాతం మంది బరువు తగ్గుతారు.

* పాదాలు పొంగిపోవడం

కాళ్ల కింద భాగంలో, పాదాలలో వాపు కలగడం కూడా ఒక లక్షణమే.

* పొత్తి కడుపు లో వాపు

పాదాలు పొంగిపోవడంతో పాటుగా పొత్తి కడుపు భాగం లో కూడా వాపు కలుగుతుంది.

* ఆకలి తగ్గి పోవడం

ఎప్పుడైతే లివర్ కు సంబంధించిన సమస్య వచ్చిందో అప్పుడు ఆకలి తగ్గి పోతుంది. ఎలాంటి ఆహారాన్ని తినాలి అని అనిపించదు.

* దాహం

దాహం పెరుగుతుంది, ఎన్ని మంచి నీరు తాగిన సరే దాహం తీరినట్టు ఉండదు. గొంతు ఆరిపోయినట్టు అనిపిస్తుంది.

* వాంతులు

వాంతులు అవడంతో పాటు వాంతులు అయ్యేటప్పుడు రక్తం కూడా వస్తుంది. కొంత మందిలో దీంతో పాటుగా మలవిసర్జన సమయంలో కూడా రక్తం వస్తుంది.
కళ్ళు పసుపు రంగులోకి మారడం :
లివర్ కు సంబంధించిన వ్యాధుల వల్ల కళ్ళు రంగు పసుపు రంగులోకి మారుతుంది. అంతే కాకుండా చర్మం కూడా పొడిబారుతుంది. దాంతో పాటుగా చర్మ ఆరోగ్యం దెబ్బ తింటుంది.

* నిద్రమత్తు

రోజంతా ఎంతో నీరసంగా నిద్ర వస్తున్నట్టు ఉంటుంది. ఉత్సాహంగా అసలు పని చేయలేరు అలా ఉండడానికి కేవలం నిద్ర మత్తు కారణం.

* ఏ ఆర్ ఎల్ డి కాంప్లికేషన్స్

ఏ ఆర్ ఎల్ ఈ సమస్య వస్తే ఎన్నో రకాల తీవ్రమైన కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి ఏమిటి అంటే పోర్టల్ హైపర్ టెన్షన్, వెరైసిస్, అసిటిస్ మరియు హెపాటిక్ ఎన్సెఫలోపతి.

* జాయింట్స్‌లో నొప్పులు

లివర్ డ్యామేజ్ అయ్యే ముందు జాయింట్స్‌లో నొప్పులు వస్తాయి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయట.. ఆర్థరైటిస్, కాలేయ సమస్యలకి సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

లివర్ దెబ్బతింటే ఏమవుతుంది?

* లివర్ ప్రక్రియ దెబ్బ తినడం వల్ల లివర్ ఆరోగ్యం చెడిపోతుంది దానితో పాటుగా ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి.
* అవి ఏమిటి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్, లివర్‌లో కొవ్వు చేరిపోవడం మరియు టైప్ 2 డయాబెటిస్ వంటి మొదలైన సమస్యలు తలెత్తుతాయి.
* లివర్‌కి ఏదైనా సమస్య ఉన్నప్పుడు హార్మోన్ల అసమతుల్యత సమస్య ఏర్పడుతుందట. కాబట్టి ఈ విషయంలో కచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి.
* లివర్ సమస్యలు వచ్చే ముందు కచ్చితంగా శరీరంలో హార్మోన్లు పెరుగుతాయి. కాబట్టి హార్మోన్ల సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు నిపుణులు.
* హార్మోన్ల సమస్యల వల్ల అలసట, నీరసం, మొటిమలు ఇలాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా వస్తుంటాయి. కొంతమందిలో జుట్టు రాలుతుంది.

* లివర్ సమస్యలు ఉన్నప్పుడు ఏం తిన్నా అరగకపోవడం, ఆకలి లేకపోవడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటాయి.

* లివర్ సమస్యలు వస్తే ఆ ఎఫెక్ట్ మన మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుందని,యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి రావచ్చని నిపుణులు చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • liver damage
  • liver damage symptoms
  • liver health
  • warning signs

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd