Lord Krishna : శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు ఈ తప్పులు చేయకండి… మీ పూజకు ఫలితం ఉండదు..!!
హిందూపురాణాల ప్రకారం...శ్రీకృష్ణ జన్మాష్టమి 2022 పండుగను ఘనంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి దేవకి, వసుదేవుల కుమారుడైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని సూచిస్తుంది.
- By hashtagu Published Date - 08:00 AM, Thu - 18 August 22
హిందూపురాణాల ప్రకారం…శ్రీకృష్ణ జన్మాష్టమి 2022 పండుగను ఘనంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి దేవకి, వసుదేవుల కుమారుడైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని సూచిస్తుంది. ఈ రోజును గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. అంతేకాదు ఈరోజును విష్ణువు ఎనిమిదవ అవతారం లేదా విష్ణువు అవతారం అయిన శ్రీకృష్ణుని జన్మ జ్ఞాపకార్థం జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు కృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం, అష్టమి తిథి ఆగస్టు 18న రాత్రి 9:20 గంటలకు ప్రారంభమై ఆగస్టు 19, 2022 రాత్రి 10:59 గంటలకు ముగుస్తుంది.
అత్యంత పవిత్రమైన రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. అర్ధరాత్రి శ్రీకృష్ణుడిని ప్రార్థించిన తర్వాత తయారు చేసిన భోగాన్ని దేవునికి తీసుకొని ఉపవాసాన్ని విరమిస్తారు. మీరు కూడా ఉపవాసం ఉంటే ఏం చేయాలి..? ఏం చేయకూడదో తెలుసా..?
1. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏం చేయాలి..?
శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు తెల్లవారుజామునే స్నానం చేసి కొత్త బట్టలు లేదా శుభ్రమైన బట్టలు ధరించాలి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు అపరిశుభ్రంగా ఉండకూడదు. మీరు ఉపవాసం విరమించకుండా శ్రీకృష్ణుని పట్ల భక్తితో చిత్తశుద్ధితో ఉపవాసం పాటించాలని కల్పం లేదా ప్రతిజ్ఞ చేస్తూ శ్రీకృష్ణుని నామాన్ని జపించండి. జన్మాష్టమి నాడు, మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. పేదలకు ఆహారాన్ని దానం చేయండి. ఇలా చేయడం శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. ఈరోజున ఆవులకు ఆహారాన్ని ఇవ్వడం మర్చిపోకండి.
2. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏం చేయకూడదు..?
జన్మాష్టమి పండుగలో లేదా భోగంలో ఉల్లి, వెల్లుల్లి వేయకూడదు. జన్మాష్టమి నాడు ఉపవాసం ఉండేటపుడు ఉల్లిపాయలు లేదా వెల్లుల్లిని వాడకూడదని లేదా తినకూడదని పురాణాల్లో ఉంది. ఈ పండుగ ఉపవాసం పవిత్రమైన ఆచారాలను కలిగి ఉన్నందున మాంసం తినకూడదు. వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినవద్దు. ఎందుకంటే ఇందులో చెడు కొలెస్ట్రాల్ ఉండి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. దానికి బదులుగా, పండ్లు, పాలు ఆరోగ్యకరమైన రసాలను తీసుకోండి.
రోజంతా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అసిడిటీ వస్తుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ తర్వాత టీకి దూరంగా ఉండండి. ఈ సందర్భంలో టీ తాగడం వల్ల అసిడిటీ పెరిగి అసౌకర్యం కలుగుతుంది. అలాగే, భక్తులకు తినడానికి లేదా వడ్డించడానికి ఉపయోగించే ఏదైనా పాత్రలు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. కృష్ణ జన్మాష్టమి పండుగ రోజున పైన పేర్కొన్న తప్పులు చేస్తే జన్మాష్టమి వ్రతం ప్రయోజనాలు మీకు అందకుండా పోతాయి. కాబట్టి జన్మాష్టమి రోజున ఇలాంటి తప్పులు చేయకూడదు. బదులుగా, కృష్ణుని ఆరాధనలో, అతని నామాన్ని స్మరిస్తూ గడపాలి.
Related News
ఈ ఆరు వస్తువులను వాషింగ్ మిషన్ లో వేస్తే అంతే సంగతులు.. అవేంటంటే?
మాములుగా మనం బట్టలను వాషింగ్ మిషన్ లో వేస్తూ ఉంటాం. మనిషి చేసే పనిని ఈ వాషింగ్ మిషన్ కాస్త సులువుగా చేసేస్తుంది. ఇటీవల కాలంలో బట్టలు ఉ