Toe Rings: స్త్రీలకాలికి మెట్టెలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
భారతదేశంలో పెళ్లయిన స్త్రీలు కాలి మెట్లు మంగళసూత్రం, బొట్టు కు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వైవాహిక
- By Nakshatra Published Date - 06:00 AM, Fri - 9 December 22
భారతదేశంలో పెళ్లయిన స్త్రీలు కాలి మెట్లు మంగళసూత్రం, బొట్టు కు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వైవాహిక జీవితంలో స్త్రీ పుస్తెలు, మెట్టెలు భర్త ఆయుష్షుతో సంబంధం ఉంటుంది. అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కేవలం భర్త ఆయుష్షుకు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. మహిళల అలంకారాలలో మెట్టెలు కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా, వాటిని ధరించడానికి కొన్ని రకాల నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఈ నియమాలు పాటించకపోతే అశుభంగా చెప్పవచ్చు.
కాగా వెండి మెట్టెలు చంద్ర గ్రహానికి సంబంధించినది. ఈ విషయంలో చేసే పొరపాటు భర్తకు హానికరం. కాబట్టి, కాలి బొటనవేలికి మెట్టెలు ధరించేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. పురాణాల ప్రకారం బంగారు మెట్టెలు కాలి వెళ్లకు ధరించడం చాలా చెడు శకునంగా చెప్పవచ్చు. బంగారు మెట్టెలు ఎప్పుడూ కూడా కాలికి ధరించకూడదు. ఎందుకంటె బంగారం లక్ష్మితో సమానం కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల లక్ష్మిని అవమానించినట్టే అవుతుంది. శాస్త్రం ప్రకారంగా పాదాలకు వెండి మెట్టెలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే మెట్టెలు కేవలం ఆభరణం మాత్రమే కాదు. మెట్టెలు సౌభాగ్యానికి సంకేతంగా బావిస్తారు. మెట్టెలు సౌభాగ్యానికి గీతంగా భావిస్తారు కాబట్టి వాటిని ఇతర మహిళలకు ఇవ్వకూడదు. అలాగే పదే పదే అవసరం లేకుండా మెట్టెలను మీ పాదాల నుండి తీయకూడదు. మెట్టెలు పోగొట్టుకోవద్దు.
మెట్టెలను కోల్పోవడం అశుభం ,భర్త ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుంది. అలాగే స్త్రీలు కాలి మెట్లను ఇతరులతో పంచుకోవడం వల్ల భర్త ధనాన్ని కోల్పోతాడు. అంతేకాదు, వివాహిత స్త్రీలు మెట్టెలు ధరించేటప్పుడు శబ్దం చేయనివి ధరించండి. వాస్తు ప్రకారం ఇటువంటి ఆభరణాలు జీవితంలో సమస్యలను కలిగిస్తాయి. ఎల్లప్పుడూ బొటనవేలు తర్వాత పాదంలో రెండవ వేలికి మాత్రమే వెండి మెట్టెలు ధరించాలి.
Related News
Toe Rings Benefits: ఆడవాళ్లు కాలికి మెట్టెలు ధరించడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?
పెళ్లయ్యాక మహిళలు కాలి ఉంగరాలు కూడా ధరించాలి. ఇది వారి అందాన్ని మరింత పెంచుతుంది. పాదాలకు కనిపించే గుర్తులు లేకపోయినా వాటిని ధరించడం చాలా ముఖ్యం.