Shani Dev Puja Rules: శని దేవునికి పూజ చేసేటప్పుడు మహిళలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే?
శనీశ్వరుడిని న్యాయ దేవుడు, కర్మదాత అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే శనీశ్వరుడు మనం చేసే పనులను బట్టి
- By Nakshatra Published Date - 07:30 AM, Fri - 28 October 22
శనీశ్వరుడిని న్యాయ దేవుడు, కర్మదాత అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే శనీశ్వరుడు మనం చేసే పనులను బట్టి శుభ,అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. మనం తప్పుడు పనులు చేస్తే శనీశ్వరుడు కష్టాలను పెట్టడంతో పాటు శిక్షిస్తాడు. శనీశ్వరుడుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ మంచి పనులు చేసే వారికి శనీశ్వరుడు అష్టైశ్వర్యాలను ఇస్తాడు. అయితే శనీశ్వరుడుని భక్తిశ్రద్ధలతో పూజించడం మంచిదే కానీ శని దేవుని పూజించే సమయంలో కొన్ని రకాల నియమాలను తప్పక గుర్తుంచుకోవాలి. లేదంటే పూజ ఫలితం దక్కకపోగా శని దేవుని కోపానికి కారకులు అవుతాం.
అందుకే శనీశ్వరుని పూజించేటప్పుడు శని దేవునికి సంబంధించిన నియమాలను తప్పక పాటించాలి అని చెబుతూ ఉంటారు . మరి శనీశ్వరుని పూజించే సమయంలో ముఖ్యంగా ఆడవారు ఎటువంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శనీశ్వరుని దృష్టి ఎప్పుడూ మంచి పనులు చేసే వారి మీద చెడ్డ పనులు చేసే వారి మీద ఉంటుంది. అయితే స్త్రీలు జాతకంలో శని దోషం ఉన్నప్పుడు లేదంటే శని మహాదశ నుండి విముక్తి కోసం శనిశ్వరుడిని భక్తితో పూజించాలి. శనీశ్వరుని పూజించేటప్పుడు మహిళలు పొరపాటున కూడా శని దేవుని విగ్రహాన్ని తాగకూడదు. ఇలా చేయడం వల్ల మీరు లేనిపోని ఇబ్బందుల్లో పడతారు.
కాగా పురాణాల ప్రకారం శని దేవుడి విగ్రహాన్ని స్త్రీలు తాగడం వల్ల వారిపై శని వక్ర దృష్టిపడుతుంది.. అదేవిధంగా శనీశ్వరుడి విగ్రహానికి మహిళలు నూనెను సమర్పించకూడదు. స్త్రీలు ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావి చెట్టు కింద నూనె దీపం వెలిగించాలి. అలాగే శనిశ్వరుడు ఆలయంలో దీపం పెట్టవచ్చు. అలాగే శనిశ్వరుడు అనుగ్రహం పొందడానికి మహిళలు శని ఆలయంలో శని చాలీసా చదవాలి మంచి ప్రయోజనం కలుగుతుంది. అదేవిదంగా శనివారం రోజు స్త్రీలు శనికి సంబంధించిన ఆవనూనె, నల్ల బట్టలు, నల్లని బూట్లు, ఇనుప పాత్రలు, నల్ల ఉసిరి, నల్ల నువ్వులు లాంటి వాటిని దానం చేయడం వల్ల శని దోష పోతుంది.
Related News
Free Bus : సీటు కోసం బస్సులో కొట్టుకున్న మగవారు
తొర్రూర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న బస్సులో భర్తలు తమ భార్యలకు సీటు కోసం కర్చీఫ్ వేశారు